IND-W vs WI-W Smriti Mandhana eyes T20I history
టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన ఓ అరుదైన రికార్డుపై కన్నేసింది. గురువారం వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్ లో ఆమె మరో 34 పరుగులు చేస్తే అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్‌లో ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తుంది. ప్రస్తుతం ఈ రికార్డు శ్రీలంక ప్లేయర్ చమరి ఆటపట్టు పేరిట ఉంది. ఈ ఏడాదిలోనే చమరి ఆటపట్టు 21 మ్యాచుల్లో 720 పరుగులతో అగ్రస్థానంలో ఉంది.
మంధాన ఇప్పటి వరకు ఈ ఏడాది 22 టీ20ల్లో 40.35 సగటుతో 686 పరుగులు చేసింది. ఇందులో ఏడు అర్ధసెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం మంధాన సూపర్ ఫామ్‌లో ఉంది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి రెండు టీ20ల్లో అర్థశతకాలతో రాణించింది. ఈ క్రమంలో మూడో టీ20లో ఈ రికార్డును అందుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు.
Ravichandran Ashwin : టీమ్ఇండియా కెప్టెన్‌గా వ్యవహరించనందుకు అశ్విన్ బాధపడ్డాడా?
అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్‌లో ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు..
చమరి ఆటపట్టు – 21 మ్యాచుల్లో 720 పరుగులు (2024లో)
ఇషా ఓజా – 20 మ్యాచుల్లో 711 పరుగులు (2024లో)
హేలీ మాథ్యూస్ – 14 మ్యాచుల్లో 700 పరుగులు (2023లో)
కవిషా ఎగోదాగే – 27 మ్యాచుల్లో 696 పరుగులు (2022లో)
స్మృతి మంధాన – 22 మ్యాచుల్లో 686 పరుగులు (2024లో)
ఇషా ఓజా – 25 మ్యాచుల్లో 675 పరుగులు (2022లో)
Virat Kohli : బాక్సింగ్‌డే టెస్టుకు ముందు.. మహిళా జర్నలిస్టుతో ఎయిర్‌పోర్టులో కోహ్లీ గొడవ..!
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ విషయానికి వస్తే.. తొలి టీ20లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించగా రెండో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ మహిళల జట్టు గెలిచింది. దీంతో ఇవాళ జరగనున్న మూడో టీ20లో గెలిచిన జట్టు సిరీస్‌ను సొంతం చేసుకోనుంది.