Ravichandran Ashwin : టీమ్ఇండియా కెప్టెన్‌గా వ్యవహరించనందుకు అశ్విన్ బాధపడ్డాడా?
అశ్విన్ మీడియాతో మాట్లాడుతూ ఐపీఎల్ ఆడడం పై క్లారిటీ ఇచ్చాడు.

Want to play for CSK as long as possible Ashwin
టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టు మ్యాచ్ డ్రా ముగిసిన అనంతరం క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. అతడు ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి చేరుకున్నాడు. చెన్నైలోని తన నివాసంలో అతడికి ఘన స్వాగతం లభించింది. డప్పు చప్పులు, పూల వర్షంతో అభిమానులు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు. ఇక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం అశ్విన్ మీడియాతో మాట్లాడుతూ ఐపీఎల్ ఆడడం పై క్లారిటీ ఇచ్చాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనప్పటికి ఆటగాడిగా తన కెరీర్ ముగియలేదన్నాడు. వీలైనంత ఎక్కువ కాలం ఐపీఎల్ ఆడేందుకు ప్రయత్నిస్తానన్నాడు. భారత జట్టుకు సారథ్యం వహించే అవకాశం దక్కనందుకు బాధపడుతున్నారా? అని ప్రశ్నించగా తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.
Virat Kohli : బాక్సింగ్‌డే టెస్టుకు ముందు.. మహిళా జర్నలిస్టుతో ఎయిర్‌పోర్టులో కోహ్లీ గొడవ..!
కెప్టెన్సీ చేయనందుకు తనకు ఎలాంటి బాధ లేదన్నాడు. తన వరకు రిటైర్‌మెంట్ నిర్ణయం పెద్ద విషయం కాదన్నాడు. ఇక ఇంత మంది తనకు స్వాగతం పలుకుతారని ఊహించలేదన్నాడు. ఎలాంటి హడావుడి లేకుండా ఇంట్లోకి వెళ్లాలని అనుకున్నానని, కానీ మీరంతా ఘన స్వాగతం పలికారన్నాడు. 2011 ప్రపంచకప్ విజయం తరువాత ఇలాగే ఘన స్వాగతం పలికారన్నాడు.
ప్రస్తుతం తాను ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నానని చెప్పాడు. కాబట్టి కొత్త లక్ష్యాలను ఏమీ పెట్టుకోలేదన్నాడు. ఐపీఎల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. చెన్నై తరుపున ఆడుతానని, వీలైనంత ఎక్కువ కాలం సీఎస్‌కేకు ఆడాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అశ్విన్ కోసం భారీ మొత్తాన్ని వెచ్చించింది. రూ.9.75 కోట్లకు వేలంలో అతడిని సొంతం చేసుకుంది.