2 టెస్టుల్లో: భారత్‌కు 120 పాయింట్లు, ఆస్ట్రేలియాకు 56 పాయింట్లు

2 టెస్టుల్లో: భారత్‌కు 120 పాయింట్లు, ఆస్ట్రేలియాకు 56 పాయింట్లు

Updated On : September 9, 2019 / 11:37 AM IST

ఇంగ్లాండ్ గడ్డపై 18ఏళ్ల నాటి కలను నెరవేర్చుకున్న ఆస్ట్రేలియా విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ గడ్డపై 2001తర్వాత తొలిసారి యాషెస్ సిరీస్ రూపంలో టెస్టు విజయాన్ని అందుకుంది. ఇది ఆసీస్‌కు గొప్ప విజయాన్నేమీ అందించలేదు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతున్న సిరీస్‌లలో ఆస్ట్రేలియా కేవలం 56 పాయింట్లు మాత్రమే గెలుచుకుంది. 

భారత్.. వెస్టిండీస్‌తో ఆడిన 2 టెస్టుల్లోనూ విజయం సాధించి 120 పాయింట్లు సొంతం చేసుకుంది. ఫలితంగా టెస్టు ఛాంపియన్ షిప్ జాబితాలో అగ్రస్థానంలో భారత్ నిలవగా ఆస్ట్రేలియా 4వ స్థానానికి చేరింది. ఆ మధ్యలో న్యూజిలాండ్ ఒక మ్యాచ్ గెలిచి రెండో స్థానంలో, శ్రీలంక మూడో స్థానంలో నిలిచాయి. ఇక ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవిచూసిన ఇంగ్లాండ్ ఐదో స్థానానికి పరిమితమైంది. 

అదెలా అంటే:
ఛాంపియన్ షిప్ ప్రకారం.. సిరీస్‌కు 120పాయింట్లు అన్నమాట. అందులో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక్క మ్యాచ్ గెలిస్తే 60 పాయింట్లు, టైగా ముగిస్తే 30 పాయింట్లు డ్రా అయితే 20పాయింట్లు వస్తాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక్క మ్యాచ్ గెలిస్తే 40 పాయింట్లు, టైగా ముగిస్తే 20 పాయింట్లు డ్రా అయితే 13పాయింట్లు వస్తాయి. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక్క మ్యాచ్ గెలిస్తే 24 పాయింట్లు, టైగా ముగిస్తే 12 పాయింట్లు డ్రాగా ముగిస్తే 8 పాయింట్లు దక్కుతాయన్న మాట.