IND vs AUS 2nd T20 : రెండో టీ20లో ఆస్ట్రేలియా ఘోర ఓటమి.. 44 పరుగుల తేడాతో గెలిచిన భారత్
India vs Australia 2nd T20 : వరుసగా రెండో టీ20 మ్యాచులోనూ భారత్ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకువెళ్లింది.

India vs Australia 2nd T20
వరుసగా రెండో టీ20 మ్యాచులోనూ భారత్ విజయం సాధించింది. తిరువనంతపురం వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచులో టీమ్ఇండియా 57 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకువెళ్లింది. 236 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 191 పరుగులకు పరిమితమైంది. ఆసీస్ బ్యాటర్లలో మార్కస్ స్టోయినిస్ (45; 25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు), మాథ్యూవేడ్ (42 నాటౌట్), టిమ్ డేవిడ్ (37) లు రాణించారు. భారత బౌలర్లలో రవిబిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ లు చెరో మూడు వికెట్లు తీశారు. అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్ తలా వికెట్ పడగొట్టారు.
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (53; 25 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (58; 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (52; 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) లు హాఫ్ సెంచరీలు చేశారు. ఆఖర్లో రింకూ సింగ్ (31 నాటౌట్; 9 బంతుల్లో 4 పోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు.
Yashasvi Jaiswal : చరిత్ర సృష్టించిన యశస్వి జైస్వాల్.. ఒకే ఒక్కడు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్‌లు శుభారంభం అందించారు. జైస్వాల్ మొదటి బంతి నుంచే ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఎడాపెడా బౌండరీలు బాదాడు. సీన్ అబాట్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో వరుసగా 4,4,4,6,6 బాది 24 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అయితే.. ఆ మరుసటి బంతికే భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో 77 పరుగుల వద్ద భారత్ మొదటి వికెట్ కోల్పోయింది.
వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ సైతం ధాటిగా ఆడాడు. ఓ వైపు రుతురాజ్ ఆచి తూచి ఆడగా మరోవైపు కిషన్ వేగంగా పరుగులు సాధించాడు. రెండో వికెట్‌కు 87 పరుగులు జోడించిన తరువాత ఇషాన్ కిషన్ పెవిలియన్‌కు చేరగా సూర్యకుమార్ యాదవ్ (19 10 బంతుల్లో 2 సిక్సర్లు) వేగంగా ఆడే క్రమంలో ఔట్ అయ్యాడు. ఆఖర్లో రింకూ సింగ్ ధాటిగా ఆడడంతో భారత స్కోరు 230 పరుగులు దాటింది.