TeamIndia : 71ఏళ్ల తరువాత..! టీమిండియా చరిత్రలో జనవరి 7వ తేదీ గుర్తుండిపోయే రోజు.. ఎందుకో తెలుసా?

ఆడిలైడ్ లో జరిగిన తొలి టెస్టు, మెల్ బోర్న్ లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా విజయం సాధించింది. అయితే, సిరీస్ లోని నాల్గో మ్యాచ్ వర్షం కారణంగా డ్రా అయింది. వర్షం లేకుంటే ఆ మ్యాచ్ కూడా టీమిండియా ఖాతాలో పడేది.

TeamIndia : 71ఏళ్ల తరువాత..! టీమిండియా చరిత్రలో జనవరి 7వ తేదీ గుర్తుండిపోయే రోజు.. ఎందుకో తెలుసా?

TeamIndia

Updated On : January 7, 2024 / 12:04 PM IST

Virat kohli : 2019 జనవరి 7వ తేదీ.. ఆరోజు టీమిండియా ఫ్యాన్స్ కు గుర్తుండే ఉంటుంది. టీమిండియా చరిత్రలో జనవరి 7వ తేదీని ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఎందుకంటే.. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా జట్టును చిత్తుచేసి టెస్టు సిరీస్ ను భారత్ జట్టు కైవసం చేసుకుంది. ఫలితంగా ఈ ఘనత సాధించిన తొలి ఆసియా జట్టుగా టీమిండియా అవతరించింది. భారత జట్టు 1947 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది.. ఆ దేశంలో పలు టెస్టు సిరీస్ లు ఆడింది. కానీ ఎప్పుడూ సిరీస్ ను గెలుచుకున్న దాఖలాలు లేవు.. భారత్ జట్టుతోపాటు ఆసియాలోని ఏ జట్టు ఆ ఘనతను సాధించలేకపోయాయి. 2019 జనవరి 7న అంటే.. 71ఏళ్లలో ఆస్ట్రేలియా గడ్డపై మొదటిసారిగా బోర్డర్ – గవాస్కర్ ట్రోపీని నిలుపుకుంది. నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను 2-1తో టీమిండియా గెలుచుకుంది.

Also Read : Rohit Sharma : ముంబై చేరుకున్న రోహిత్ శ‌ర్మ‌.. అఫ్గాన్‌తో టీ20 సిరీస్ ఆడ‌తాడా..!

కోహ్లీ సారథ్యంలో టీమిండియా టెస్టు సిరీస్ లోని నాలుగు మ్యాచ్ లలో బరిలోకి దిగింది. ఆడిలైడ్ లో జరిగిన తొలి టెస్టు, మెల్ బోర్న్ లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా విజయం సాధించింది. అయితే, సిరీస్ లోని నాల్గో మ్యాచ్ వర్షం కారణంగా డ్రా అయింది. వర్షం లేకుంటే ఆ మ్యాచ్ కూడా టీమిండియా ఖాతాలో పడేది. ఈ సిరీస్ లో పుజారా మూడు సెంచరీలు, ఒక ఆఫ్ సెంచరీ చేశాడు. ఫలితంగా 74.42 సగటుతో 521 పరుగులు సాధించాడు. రిషబ్ పంత్ (350), విరాట్ కోహ్లీ (282) తర్వాతి స్థానాల్లో నిలిచారు.

Also Read : IND vs AFG : భార‌త్‌తో టీ20 సిరీస్‌కు అఫ్గానిస్తాన్ జ‌ట్టు ప్ర‌కట‌న‌.. ర‌షీద్ ఖాన్‌కు షాక్‌..!

అదేవిధంగా టీమిండియా బౌలర్లుసైతం ఈ టెస్టు సిరీస్ లో అద్భుతంగా రాణించి ఆస్ట్రేలియా బ్యాటర్లను కంగారెత్తించారు. ఈ సిరీస్ లో జస్ప్రీత్ బూమ్రా 21 వికెట్లతో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. ఇందులో ఐదు వికెట్లుకూడా ఉన్నాయి. షమీ 16, ఇషాంత్ 11 వికెట్లు పడగొట్టారు. ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్ లో విజయం తరువాత అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు టీమిండియా క్రికెటర్లు డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Teamindia