IND vs AUS: పెర్త్ టెస్టులో టాసే కీలకం.. తొలుత బ్యాటింగ్ చేసే జట్టుదే విజయమా? గణాంకాలు ఇలా..
ఆప్టస్ స్టేడియంలో ఇప్పటి వరకు మొత్తం నాలుగు టెస్టు మ్యాచ్ లు జరిగాయి. నాలుగు టెస్టుల్లోనూ ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టే విజయం సాధించింది. అందులోనూ.. ఈ నాలుగు టెస్టుల్లోనూ

Optus Stadium in Perth
Perth Stadium Test Stats, Records: టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ లో రెండు ప్రధాన జట్ల మధ్య అసలైన పోరు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఇందుకు పెర్త్ లోని ఆప్టస్ స్టేడియం వేదిక కానుంది. బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ లు జరగనున్నాయి. మొదటి టెస్టు మ్యాచ్ ఇవాళ పెర్త్ లోని ఆప్టస్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఉదయం 7.50 గంటల నుంచి టెస్టు ప్రారంభం కానుంది. రోహిత్ గౌర్హాజరీతో ఫాస్ట్ బౌలర్ బుమ్రా సారథ్యంలో టీమిండియా ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది. అయితే, ఈ మ్యాచ్ లో టాస్ కీలక భూమిక పోషిస్తుందని, టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
Also Read: AUS vs IND : భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్.. ఫ్రీగా ఎలా చూడొచ్చొ తెలుసా?
పెర్త్ లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లకు అతిథ్యం ఇవ్వడానికి డబ్ల్యూఏసీఏ స్థానంలో కొత్త స్టేడయం ఏర్పాటు చేశారు. స్పాన్సర్‌షిప్ కారణాల దృష్ట్యా కొత్త ఆప్టస్ స్టేడియం అని పేరు పెట్టారు. ఈ మైదానంలో 60,000 మంది ప్రేక్షక్షులు మ్యాచ్ ను తిలకించేందుకు అవకాశం ఉంది. ఈ ఆప్టస్ స్టేడియంలో ఇప్పటి వరకు మొత్తం నాలుగు టెస్టు మ్యాచ్ లు జరిగాయి. నాలుగు టెస్టుల్లోనూ ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టే విజయం సాధించింది. అందులోనూ.. ఈ నాలుగు టెస్టుల్లోనూ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయడం విశేషం.
స్టేడియం గణాంకాలు ఇలా..
♦ 2018లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా జట్ల మధ్య ఆప్టస్ స్టేడియంలో తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు 146 పరుగుల తేడాతో ఓడిపోయింది.
♦ 2019 డిసెంబర్ లో న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆప్టస్ స్టేడియంలో రెండో టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ టెస్టులో ఆస్ట్రేలియా 296 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
♦ వెస్టిండీస్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆప్టస్ స్టేడియంలో మూడో టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లోనూ ఆస్ట్రేలియానే విజయం సాధించింది.
♦ పాకిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య 2023 డిసెంబర్ 14 నుంచి 17వరకు ఆప్టస్ స్టేడియంలో నాల్గో టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 360 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.
♦ ఇక్కడ విశేషం ఏమిటంటే ఆప్టస్ స్టేడియంలో జరిగిన నాలుగు మ్యాచ్ లలోనూ ఆస్ట్రేలియానే టాస్ గెలవడం, తొలుత బ్యాటింగ్ చేయడం విశేషం.
♦ ఇవాళ్టి నుంచి ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మధ్య ఆప్టస్ స్టేడియంలో ఐదో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లోనూ టాస్ కీలకం కానుంది. గణాంకాలను బట్టి చూస్తే తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.