ఇండియా – ఆస్ట్రేలియా మూడో టెస్టుకు లైన్ క్లియర్

India vs Australia 3rd Test at SCG : ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరగనున్న మూడో టెస్టుకు లైన్ క్లియర్ అయింది.. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ క్రికెట్ ఆస్ట్రేలియా ఒక దశలో మ్యాచ్‌ను రద్దు చేయాలనే ఆలోచనకు వచ్చింది… ఇంతలో బీసీసీఐ జోక్యంతో వ్యవహారం సద్ధుమణిగింది.. దీంతో ఈ నెల 7వ తేదీన జరగనున్న మ్యాచ్‌కు ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. సిడ్నీ టెస్టుకు ముందే టీమిండియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఫామ్‌లో ఉన్న యంగ్ ప్లేయర్.. కేఎల్ రాహుల్ గాయంతో టూర్‌కు దూరమయ్యాడు.
ప్రాక్టీస్ చేస్తున్న టైంలో అతని ఎడమచేతి మణికట్టు బెణకడంతో చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉండడని బీసీసీఐ ప్రకటించింది. ఇప్పటికే కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ జట్టుకు దూరమవ్వగా.. తాజాగా రాహుల్ కూడా దూరమవ్వడం కాస్త ఇబ్బందిని కలిగించే విషయమంటున్నారు విశ్లేషకులు.. రాహుల్ కోలువడానికి మూడు వారాలు పడుతుండటంతో అతడు స్వదేశానికి బయలుదేరి.. ఎన్సీఏలో చేరనున్నాడు.
ఇక మూడో టెస్టు జరగనున్ సిడ్నీ గ్రౌండ్‌లో టీమిండియాకు చెత్త రికార్డు ఉంది. అక్కడ మొత్తం 12 మ్యాచులు ఆడగా.. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. 1978లో బిషన్ సింగ్ బేడీ నేతృత్వంలో ఇన్నింగ్స్ రెండు పరుగుల తేడాతో ఆసీస్ చిత్తైంది. ఆ తర్వాత అన్ని టెస్టుల్లో తడబడినా మరో గెలుపు సాధించలేదు. ఇటు ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే కెప్టెన్ రహానె… ధోనీ రికార్డును సమం చేయనున్నాడు. కెప్టెన్సీ తీసుకున్న తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో జట్టును గెలిపించిన రెండో టీమిండియా కెప్టెన్‌గా నిలవనున్నాడు. రహానె కెప్టెన్సీలో భారత్ 2017లో ఆస్ట్రేలియాపై, 2018లో ఆఫ్గనిస్తాన్‌పై, 2020లో ఆస్ట్రేలియాపై బాక్సిండ్ డే టెస్టులో విక్టరీ సాధించింది..