ఫైనల్ టెస్టు: రిషబ్ పంత్ సెంచరీ రికార్డ్

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ సెంచరీ బాదేశాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరి నాల్గో టెస్టులో రిషబ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆసీస్ విసిరిన బంతులను బౌండరీలు దాటిస్తూ సెంచరీ నమోదు చేశాడు.

  • Published By: sreehari ,Published On : January 4, 2019 / 05:17 AM IST
ఫైనల్ టెస్టు: రిషబ్ పంత్ సెంచరీ రికార్డ్

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ సెంచరీ బాదేశాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరి నాల్గో టెస్టులో రిషబ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆసీస్ విసిరిన బంతులను బౌండరీలు దాటిస్తూ సెంచరీ నమోదు చేశాడు.

  • ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ.. ఇండియా తొలి వికెట్ కీపర్ ఇతడే.. 

సిడ్నీ: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ సెంచరీ బాదేశాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరి నాల్గో టెస్టులో రిషబ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆసీస్ విసిరిన బంతులను బౌండరీలు దాటిస్తూ 137 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. తాను ఆడిన టెస్టుల్లో రెండు సెంచరీలు సాధించిన రిషబ్.. ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక పరుగులు సాధించిన తొలి భారత వికెట్ కీపర్ గా రికార్డు నెలకొల్పాడు. తన టెస్టు కెరీర్ లో 21ఏళ్ల పంత్ రెండు సెంచరీలు సాధించగా.. ఆడింది 9 టెస్టులు మాత్రమే.

ఇక రెండో రోజు ఆటలో తొలి ఇన్నింగ్స్ లో భారత్ టీ విరామ సమయానికి (491/6) పరుగులు చేయగా.. 148.2 ఓవర్లలో 500 స్కోరు చేసింది. ప్రస్తుతం భారత్ 156.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 543 (రిషబ్ పంత్ 122, జడేజా 45 నాటౌట్ ) పరుగులతో కొనసాగుతోంది. నాలుగు టెస్టుల సిరీస్ లో భారత్ 2-1 సిరీస్ తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే సిరీస్ సొంతం అవుతుంది. లేదంటే డ్రా అయ్యే అవకాశాలు ఉన్నాయి.