IML 2025: బౌండరీల మోత మోగించిన యువరాజ్ సింగ్, సచిన్.. ఐఎంఎల్ ఫైనల్లోకి ఇండియా.. వీడియోలు వైరల్

టీమిండియా మాజీ ప్లేయర్లు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ లు మైదానంలో బ్యాట్ తో విధ్వంసం సృష్టించాడు.

IML 2025: బౌండరీల మోత మోగించిన యువరాజ్ సింగ్, సచిన్.. ఐఎంఎల్ ఫైనల్లోకి ఇండియా.. వీడియోలు వైరల్

Sachin Tendulkar - Yuvraj Singh

Updated On : March 14, 2025 / 7:16 AM IST

Yuvraj Singh – Sachin Tendulkar: టీమిండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ బ్యాట్ తో విధ్వంసం సృష్టించాడు. వరుస సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 30 బంతుల్లోనే ఒక ఫోరు, ఏడు సిక్సుల సహాయంతో 59 పరుగులు చేశాడు. యువీకి సచిన్ టెండూల్కర్ కూడా తోడుకావటంతో స్టేడియంలో బౌండరీల మోత మోగింది. సచిన్ 30 బంతుల్లో ఏడు ఫోర్లు సాయంతో 42 పరుగులు చేశాడు. యువీ, సచిన్ దూకుడైన బ్యాటింగ్ కు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Also Read: IPL 2025 : ఆర్‌సీబీ పూర్తి షెడ్యూల్ ఇదే.. మ్యాచ్‌లు, తేదీలు, సమయాలు, వేదికలు, ప్ర‌త్య‌ర్థులు

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (ఐఎంఎల్) లో సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని ఇండియా మాస్టర్స్ ఫైనల్ కు దూసుకెళ్లింది. గురువారం ఇండియా మాస్టర్స్, ఆస్ట్రేలియా మాస్టర్స్ జట్లు సెమీ ఫైనల్లో తలపడ్డాయి. దీంతో ఇండియా మాస్టర్స్ 94 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా మాస్టర్స్ భారీ స్కోర్ సాధించింది. యువరాజ్ సింగ్ 30 బంతుల్లో 59 (ఒక ఫోర్, 7సిక్సులు), సచిన్ టెండూల్కర్ 30 బంతుల్లో 42 (ఏడు ఫోర్లు) మెరుపు ఇన్సింగ్స్ ఆడారు. యువరాజు క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల మోత మోగించాడు. వీరికితోడు స్టువర్ట్ బిన్నీ (36), యూసుఫ్ పఠాన్ (23), ఇర్ఫాన్ పఠాన్ (19) దూకుడుగా ఆడారు. దీంతో ఇండియా మాస్టర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 220 భారీ స్కోర్ చేసింది.

Also Read: IPL 2025 : స‌న్‌రైజ‌ర్స్ హైదారాబాద్ పూర్తి షెడ్యూల్.. మ్యాచ్‌లు, తేదీలు, సమయాలు, వేదికలు

భారీ పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు స్వల్ప పరుగులకే చేతులెత్తేసింది. 18.1 ఓవర్లలో 126 పరుగులకే జట్టు బ్యాటర్లు ఆలౌట్ అయ్యారు. ఆ జట్టులో బెన్ కటింగ్ (39) టాప్ స్కోరర్ గా నిలిచాడు. షాబాజ్ నదీమ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. వినయ్ కుమార్ రెండు, ఇర్ఫాన్ పఠాన్ రెండు వికెట్లు పడగొట్టారు. శుక్రవారం వెస్టిండీస్, శ్రీలంక మధ్య రెండో సెమీస్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో ఆదివారం సచిన్ సేన ఫైనల్ లో తలపడుతుంది.