ఫస్ట్ ఇండియన్ ఇతడే : 2 సిక్సులే బ్యాలెన్స్.. 400 సిక్సుల క్లబ్‌కు చేరువలో రోహిత్ 

  • Published By: sreehari ,Published On : November 9, 2019 / 11:31 AM IST
ఫస్ట్ ఇండియన్ ఇతడే : 2 సిక్సులే బ్యాలెన్స్.. 400 సిక్సుల క్లబ్‌కు చేరువలో రోహిత్ 

Updated On : November 9, 2019 / 11:31 AM IST

అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన మైలురాయిని చేరుకోనున్నాడు. మూడు టీ20 మ్యాచ్ సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్ తో ఆదివారం (నవంబర్ 10) నాడు ఆఖరి మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో 2-2 టైగా ముగియగా.. మూడో టీ20 మ్యాచ్ సిరీస్ విజేత ఎవరో తేల్చనుంది. ఈ మ్యాచ్‌లో తన కుడిచేతి వాటంతో రోహిత్ మరోసారి మెరుపులు మెరిపించనున్నాడు. తద్వారా 400 సిక్సుల క్లబ్ కు అతి చేరువలో నిలిచాడు. రెండో టీ20 మ్యాచ్‌లో 6 సిక్సులు బాదిన రోహిత్.. తన ఇన్నింగ్స్ లో 43 బంతుల్లో 85 పరుగులు సాధించాడు. 

దీంతో టీమిండియా 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో విజయంతో రోహిత్ అన్ని ఫార్మాట్లతో కలిపి మొత్తంగా 398 సిక్సులు బాదాడు. ఇప్పటివరకూ వన్డేల్లో రోహిత్ 232 సిక్సులు తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో మాత్రం 51 సిక్సులు బాదాడు. ఇప్పటివరకూ అంతర్జాతీయ టీ20ల్లో 115 సిక్సులను రోహిత్ తన పేరిట లిఖించుకున్నాడు. 

ఆదివారం జరుగబోయే మూడో టీ20లో 32ఏళ్ల రోహిత్.. మరో 2 సిక్సులు బాదితే.. 400 సిక్సుల క్లబ్‌లో జాయిన్ అవుతాడు. ఇప్పటివరకూ ఈ అరుదైన మైలురాయిని కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే చేరుకోగలిగారు. మాజీ పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ షాహిద్ అఫ్రిది (476 సిక్సులు), వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ (534 సిక్సులు)లతో ఈ ఫీట్ సాధించారు. మరో రెండు సిక్సులు బాదితే చాలు.. రోహిత్  400 సిక్సులు బాదిన తొలి భారతీయుడిగా క్రికెటర్ల జాబితాలో చేరుతాడు.