India vs England 3rd T20I: మీ మొబైల్ ఫోన్లో మూడో టీ20 మ్యాచ్ వాచ్ చేయండిలా..

టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. అహ్మదాబాద్ వేదికగా మంగళవారం రాత్రి 7 గంటలకు మూడో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. లైవ్ మ్యాచ్ అప్ డేట్స్ మీ స్మార్ట్ ఫోన్ లో వాచ్ చేయొచ్చు.

India vs England 3rd T20I:  మీ మొబైల్ ఫోన్లో మూడో టీ20 మ్యాచ్ వాచ్ చేయండిలా..

India Vs England 3rd T20i How To Watch On Your Mobile Phone

Updated On : March 16, 2021 / 7:32 PM IST

India vs England 3rd T20I : ఐదు టీ20ల సిరీస్ మ్యాచ్ లో భాగంగా టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. అహ్మదాబాద్ వేదికగా మంగళవారం రాత్రి 7 గంటలకు మూడో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలిస్తే.. రెండో టీ20 మ్యాచ్ లో కోహ్లీసేన విజయం సాధించింది. కోవిడ్-19 నిబంధనలతో మ్యాచ్ లను నిర్వహిస్తున్నారు.

అయితే ఈ లైవ్ మ్యాచ్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడూ మీ స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. మూడో టీ20 మ్యాచ్ లైవ్ మ్యాచ్ స్టార్ నెట్ వర్క్, హాట్ స్టార్ ద్వారా సులభంగా వీక్షించవచ్చు.

స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 HD ఛానళ్లలో అన్ని లైవ్ మ్యాచ్ లు టెలిక్యాస్ట్ అవుతున్నాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా లైవ్ క్రికెట్ మ్యాచ్ లు చూడాలంటే వెబ్ లేదా ఆండ్రాయిడ్, ఐఓఎస్, అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ద్వారా యాక్సస్ చేసుకోవచ్చు.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రీమియం లేదా విఐపీ సబ్ స్ర్కిప్షన్ పొందవచ్చు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రీమియం సబ్ స్ర్కిప్షన్ కోసం నెలకు రూ.299 చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి రూ.1,499 చెల్లించాల్సి ఉంటుంది. ఇక VIP సబ్ స్ర్కిప్షన్ కోసం ఏడాదికి రూ.399 వరకు చెల్లించాలి.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ VIP ఫ్రీగా పొందాలంటే? :
రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ బెండెల్ పై కంప్లిమెంటరీ ప్లాన్ల ద్వారా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీ సబ్ స్ర్కిప్షన్ ఉచితంగా పొందవచ్చు. ప్రీపెయిడ్ ప్లాన్లలో ఎయిర్ టెల్ రూ.401, రూ.448, రూ.599, రూ.2,698 రీఛార్జ్ చేసుకోవచ్చు.

అలాగే రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్లలో రూ.401, రూ.499, రూ.598, రూ.777 ద్వారా వీఐపీ సబ్ స్ర్కిప్షన్ ఉచితంగా పొందవచ్చు.

ఈ ప్లాన్లలో ఏదైనా ఒకటి రీఛార్జ్ చేసుకోగానే 10 నిమిషాల్లో ఈ కాంప్లిమెంటరీ సబ్ స్ర్కిప్షన్ యాక్టివేట్ అవుతుంది. మీ మొబైల్ నెంబర్, ఓటీపీ ద్వారా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వెబ్ సైట్ లేదా యాప్ లో లాగిన్ కావొచ్చు.