నాల్గో టెస్టు : రెండోరోజు ముగిసిన ఆట : 89 పరుగుల ఆధిక్యంలో భారత్, స్కోరు 294/7

India vs England 4th Test : ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఆఖరి నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ 93.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. దాంతో కోహ్లీసేన తొలి ఇన్నింగ్స్ లో 89 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో రోజు ఆటలో సెంచరీతో రెచ్చిపోయిన రిషబ్ పంత్ ఈ సిరీస్‌లో (105)తో టెస్టుల్లో మూడో సెంచరీ నమోదు చేశాడు.
It’s Stumps on Day 2 of the 4⃣th @Paytm #INDvENG Test! #TeamIndia 294/7, lead England by 89 runs. @RishabhPant17 1⃣0⃣1⃣@Sundarwashi5 6⃣0⃣*
Scorecard ? https://t.co/9KnAXjaKfb
Join us tomorrow for Day 3⃣ action! pic.twitter.com/oRbJ569oZK
— BCCI (@BCCI) March 5, 2021
సొంతగడ్డపై తొలి సెంచరీ కాగా.. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో రెండు సెంచరీలు నమోదు చేశాడు. రోహిత్ శర్మ (49) ఔట్ కాగా.. వాషింగ్టన్ సుందర్ (60)హాఫ్ సెంచరీ, అక్షర్ పటేల్ (11) నాటౌట్‌గా నిలిచారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ 3 వికెట్లు తీసుకోగా, స్టోక్స్ లీచ్ తలో 2 వికెట్లు పడగొట్టారు.
A brilliant century stand between Rishabh Pant and Washington Sundar helped India go to stumps on 294/7 on day two.
The hosts lead by 89 runs.#INDvENG | https://t.co/6OuUwURcgX pic.twitter.com/CwUzuYc6Er
— ICC (@ICC) March 5, 2021
ఈ సిరీస్‌లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో టీమ్‌ఇండియా కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరాలని ఆశిస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్ గెలిచి సిరీస్ డ్రా చేయాలని ఉవ్విళ్లూరుతోంది.