ధోనీ ఎంట్రీ: కివీస్‌తో ఆఖరిపోరులో విజయం దక్కేనా?

న్యూజిలాండ్ పర్యటనలో తొలి ఫార్మాట్‌ను టీమిండియా ఆదివారంతో ముగించనుంది. మూడో వన్డేతోనే 3-0ఆధిక్యంతో సిరీస్ చేజిక్కించుకున్న టీమిండియా.. ఆడాల్సిన రెండు వన్డేలలో ఒకదాన్ని పేలవంగా ముగించింది. ఫలితంగా న్యూజిలాండ్ జట్టుకు సునాయాసంగా విజయాన్ని తెచ్చిపెట్టింది. హామిల్టన్ వేదికగా 92 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియాను కివీస్ 14.4ఓవర్లలోనే ముగించేసింది. చక్కటి వ్యూహంతో బరిలోకి దిగిన విలియమ్సన్ సేన టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 30.5ఓవర్లలోనే భారత బ్యాట్స్‌మెన్‌ను ఆలౌట్ చేసింది. చాహల్ వ్యక్తిగత స్కోరు మాత్రమే 18 దాటిందంటే భారత్ బ్యాటింగ్‌లో ఎంత ఘోరంగా విఫలమైందనడంలో చెప్పేయొచ్చు.
నాలుగో వన్డేలో టీమిండియా ప్రధాన లోపం వ్యూహ కర్త మహేంద్రసింగ్ ధోనీ, పరుగుల యంత్రం, రికార్డుల రారాజు కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకపోవడమే. ఇప్పటికే కోహ్లీకి విశ్రాంతి కారణంగా ఈ పర్యటన నుంచి తప్పుకున్నాడు. మరోవైపు మహేంద్ర సింగ్ ధోనీ మూడో వన్డేకు ముందే కాలి కండరాలు పట్టేయడంతో జట్టు నుంచి తప్పుకున్నాడు. దాంతో హార్దిక్ పాండ్యాకు స్థానం దక్కింది. పర్యాటక జట్లపై విరుచుకుపడి ఎన్నో మ్యాచ్‌లలో విజయం దక్కించుకున్న రోహిత్ శర్మపై పెట్టుకున్న అభిమానులను నిరుత్సాహపరిచాడు.
ఇక సిరీస్‌లో ఆఖరిదైన ఐదో వన్డేను విజయంతో ముగించాలని ఆరాటపడుతున్న టీమిండియా.. మహేంద్ర సింగ్ ధోనీ చివరి మ్యాచ్‌లో పాల్గొంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ధోనీ తిరిగొస్తాడని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ నమ్మకాన్ని వ్యక్తపరిచాడు. ఈ మ్యాచ్‌కు మొహమ్మద్ షమీ కూడా తిరిగొస్తుండటంతో భువనేశ్వర్ కుమార్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. కోహ్లీ ముందుగా కొత్త వాళ్లకు అవకాశం ఇస్తామని చెప్పినట్లుగానే ఖలీల్ అహ్మద్ బదులు మొహమ్మద్ సిరాజ్‌కు అవకాశం కల్పించనుంది. ఖలీల్ ఆఖరి మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయకపోగా 5 బంతులకు 5పరుగులు మాత్రమే చేయగలిగాడు.
ఇక కివీస్ విషయానికొస్తే ఓపెనర్ హెన్రీ నికోలస్ బదులుగా జట్టులోకి వచ్చిన కొలిన్ మున్రోను ఐదో వన్డేలోనూ కొనసాగించనున్నారు. వెన్నెముక గాయం కారణంగా మార్టిన్ గఫ్తిల్ జట్టుకు దూరంగా కానున్నాడు.
ఇండియా:
రోహిత్ శర్మ(captain), శిఖర్ ధావన్, మహేంద్ర సింగ్ ధోనీ (wk), కేదర్ జాదవ్, దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్, శుభ్‌మన్ గిల్, చాహల్, కుల్దీప్ యాదవ్, షమీ, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ సిరాజ్, ఖలీల్ అహ్మద్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా.
న్యూజిలాండ్:
కేన్ విలియమ్సన్ (captain), టోడ్డీ యాస్లే, ట్రెంట్ బౌల్ట్, కొలిన్ డె గ్రాండ్ హోమ్, ఫెర్గ్యూసన్, మార్టిన్ గఫ్తిల్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్(wk), కొలిన్ మున్రో, జిమ్మీ నీషం, హెన్రీ నికోలస్, మిచెల్ శాంతర్, టిమ్ సౌథీ, రాస్ టేలర్.