సొంతగడ్డపై సఫారీలపై మూడు టెస్టుల సిరీస్ ఆడుతున్న క్రమంలో.. భారత విజృంభణ కొనసాగించింది. గురువారం ఆరంభమైన రెండో టెస్టులో తొలి రోజు 3వికెట్లు నష్టానికి 273 పరుగులు మాత్రమే చేయగలిగింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో పూజారా, కోహ్లీలు హాఫ్ సెంచరీలు సాధించగా మయాంక్ సెంచరీతో అదరగొట్టాడు.
తొలి టెస్టులో డబుల్ సెంచరీతో అదరగొట్టిన ఓపెనర్ మయాంక్ ఈ టెస్టులో సెంచరీతో చెలరేగాడు. 195 బంతులు ఎదుర్కొన్న మయాంక్ 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 108 పరుగులు చేసి రబాడ బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు చేసిన మరో ఓపెనర్ రోహిత్ శర్మ ఈసారి 14 పరుగులకే పెవిలియన్ చేరాడు.
చతేశ్వర్ పుజారా 58 పరుగులు చేసి పరవాలేదనిపించాడు. భారత్ కోల్పోయిన మూడు వికెట్లు రబాడకే దక్కడం గమనార్హం. ప్రస్తుత కెప్టెన్ కోహ్లీ 63, అజింక్య రహానె 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.
That will be Stumps on Day 1 in Pune. #TeamIndia 273/3. Kohli 63*, Rahane 18*. Join us for Day 2 tomorrow #INDvSA @Paytm pic.twitter.com/78HYVJAD2g
— BCCI (@BCCI) October 10, 2019