India Vs South Africa : పంత్ మెరుపు ఇన్నింగ్స్.. కోహ్లీ డ్యాన్స్

ఇతను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ..డ్రెసింగ్ రూంలో కూర్చొన్నాడు. అతడిని అభినందిస్తూ..కుర్చీలో నుంచే ఓ చేతిని గాల్లోకి అటూ ఇటూ..ఊపుతూ..డ్యాన్స్ చేశాడు...

India Vs South Africa : పంత్ మెరుపు ఇన్నింగ్స్.. కోహ్లీ డ్యాన్స్

Kohli Dance

Updated On : January 21, 2022 / 7:41 PM IST

Kohli Dance In Dressing Room : సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో భారత్ బ్యాట్స్ మెన్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ భారీ స్కోరు సాధించడంలో పంత్ కీలక పాత్ర పోషించాడు. ఇతను 85 పరుగులు చేశాడు. అయితే..ఇతను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ..డ్రెసింగ్ రూంలో కూర్చొన్నాడు. అతడిని అభినందిస్తూ..కుర్చీలో నుంచే ఓ చేతిని గాల్లోకి అటూ ఇటూ..ఊపుతూ..డ్యాన్స్ చేశాడు. కెమెరాలు అతడిని బంధించడంతో దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కోహ్లీ డ్యాన్స్ చేస్తుండగా..పక్కనే ఉన్న శిఖర్ ధావన్ చిరునవ్వులు చిందించాడు.

Read More : Goa Assembly Poll : బీజేపీకి ఉత్పల్ పారికర్ రాజీనామా.. ఇండిపెండెంట్‌‌గా బరిలోకి

2022, జనవరి 21వ తేదీ శుక్రవారం భారత్ – సౌతాఫ్రికా మధ్య రెండో వన్డే జరుగుతోంది. మొదటి వన్డేలో భారత్ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో గెలవాలనే కసితో భారత టీం బరిలోకి దిగింది. టాస్ గెలిచిన అనంతరం బ్యాటింగ్ ఎంచుకుంది. 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ధావన్ (29) త్వరగానే అవుట్ అయ్యాడు. కోహ్లీ డకౌట్ గా వెనుదిరిగి అభిమానులను నిరాశపరిచాడు. ఇతర బ్యాట్స్ మెన్స్ రాణించారు. రాహుల్ (55), పంత్ (85) పరుగులు చేయడంతో మెరుగైన స్కోరు నమోదైంది. పంత్, రాహుల్ అవుట్ కావడంతో తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్స్ తడబడ్డారు. చివరిలో శార్దూల్ ఠాకూర్ 40 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కోహ్లీకి ఇది 450వ వన్డే మ్యాచ్ కావడం విశేషం. అంతేగాకుండా వన్డేలో 14వ సారి డకౌట్ అయ్యాడు.