IND vs SA 1st Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..

సఫారీ గడ్డపై మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

IND vs SA 1st Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..

South Africa

Updated On : December 26, 2021 / 1:55 PM IST

IND vs SA 1st Test: సఫారీ గడ్డపై మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గత 29 ఏళ్లలో సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్‌ గెలవలేకపోయిన భారత జట్టు, ఈ సారి సిరీస్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. విరాట్ కోహ్లి నాయకత్వంలో భారత జట్టు ఈ సిరీస్‌ను చిరస్మరణీయంగా మార్చేందుకు ప్రయత్నిస్తుంది.

ప్రస్తుతం టీమ్ ఇండియా మంచి ఫామ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ సిరీస్‌ను భారత్‌ గెలిచే అవకాశం ఉందని క్రికెట్‌ దిగ్గజాలందరూ భావిస్తున్నారు.

మయాంక్, రాహుల్ ఓపెనింగ్:

మయాంక్ అగర్వాల్, KL రాహుల్ భారత జట్టుకు ఓపెనింగ్ చేయబోతున్నారు. ఇటీవల రోహిత్ శర్మ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో చెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లి మిడిలార్డర్‌లో జట్టును బలోపేతం చేసేందుకు కృషి చేస్తారు.

దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI:
డీన్ ఎల్గర్ (c), ఐడెన్ మార్క్‌రామ్, కీగన్ పీటర్సన్, రాసి వాన్ డెర్ డుసెన్, టెంబా బావుమా, క్వింటన్ డి కాక్ (WK), వియాన్ ముల్డర్, మార్కో జెన్‌సన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, లుంగి ఎన్‌గిడి.

భారత ప్లేయింగ్ XI:
కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే, రిషబ్ పంత్ (డబ్ల్యూకే), శార్దూల్ ఠాకూర్, ఆర్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.