టీ20ల్లో వైస్ కెప్టెన్.. కెప్టెన్‌కు మధ్య పోటీ నడుస్తూనే ఉంది. పరుగుల యంత్రం రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి ధీటుగా రికార్డులు కొల్లగొడుతున్న రోహిత్ శర్మ కోసం ప్రపంచ రికార్డు ఎదురుచూస్తోంది. కేవలం 8పరుగుల దూరంలో రికార్డు బద్దలుకొట్టనున్నాడు రో ‘హిట్’. బెంగళూరు వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడో టీ20లో రోహిత్ ఈ ఘనత సాధిస్తాడని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
కోహ్లీ-రోహిత్‌ల మధ్య పరుగుల పోరులో ఎవరు ఆధిక్యంలో నిలుస్తారో మూడో టీ20 నిర్ణయించనుంది. మొహాలీ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో టీ20 ఆడకముందు రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే అదే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(72 నాటౌట్) హాఫ్ సెంచరీకి మించిన స్కోరుతో రాణించి రోహిత్ శర్మను అధగమించాడు.
దాంతో టీ20ల్లో కోహ్లీ 71 ఇన్నింగ్స్‌ల్లో 2,441 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. అదే మ్యాచ్‌లో 12 పరుగులు చేసిన రోహిత్ శర్మ మూడో టీ20లో ఓపెనర్‌గా 8 పరుగులు చేస్తే చాలు.. కోహ్లీ రికార్డుని బద్దలుకొట్టినట్లే. అతి తక్కువ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా రోహిత్ రికార్డు సృష్టిస్తాడు. కానీ, వన్ డౌన్‌లో వచ్చిన కోహ్లీ.. ఎక్కువ పరుగులు చేయకుంటేనే ఇది సాధ్యమవుతుంది.