అరుదైన ఘనత సాధించిన తొలి భారత కెప్టెన్ కోహ్లీ

సొంతగడ్డపై కోహ్లీసేన రెచ్చిపోతుంది. తొలి టెస్టులో రోహిత్ సెంచరీలతో మెరిపిస్తే రెండో టెస్టులో విరాట్ కోహ్లీ బ్యాట్ ఝళిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ శుక్రవారం మ్యాచ్‌లో సెంచరీకి మించిన స్కోరుతో దూసుకుపోతున్నాడు. ఓవర్ నైట్ స్కోరు 273/3తో ఆరంభించిన టీమిండియా 400 దాటేసింది.
కోహ్లీ-రహానె జోడీగా ఆరంభించిన రెండో రోజు మ్యాచ్‌లో రహానె 59పరుగులు చేసి మహారాజ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో కోహ్లీ తన కెరీర్లో 26వ టెస్టు సెంచరీ నమోదు చేసినట్లు అయింది. అంతర్జాతీయ క్రికెట్ లో కెప్టెన్‌గా కోహ్లీకి 40వ సెంచరీ. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో కోహ్లీ ఈ ఘనత నమోదు చేశాడు.
కెప్టెన్‌గా 40 అంతర్జాతీయ క్రికెట్ సెంచరీలు నమోదు చేసిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డు సాధించాడు. 2014 సంవత్సరంలో మహేంద్ర సింగ్ ధోనీ చేతుల మీదుగా కెప్టెన్సీ అందుకున్న కోహ్లీ.. 19టెస్టు సెంచరీలు, 21వన్డే సెంచరీలు నమోదు చేశాడు. గతంలో కెప్టెన్‌గా రిక్కీ పాంటింగ్ 41 సెంచరీలు నమోదు చేయగా, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 33 సెంచరీలు, ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 20అంతర్జాతీయ సెంచరీలు నమోదు చేశారు.
Run machine @imVkohli congratulations on your 26th test 100 ? pic.twitter.com/jeUJhPlfxb
— Harbhajan Turbanator (@harbhajan_singh) October 11, 2019