IND vs ZIM 4th T20 : జింబాబ్వేపై 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం

ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హ‌రారే వేదిక‌గా భార‌త్, జింబాబ్వే జ‌ట్ల మ‌ధ్య నాలుగో టీ20 మ్యాచ్ జ‌రిగింది.

IND vs ZIM 4th T20 : జింబాబ్వేపై 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం

Pic Credit: @ZimCricketv Twitter

Updated On : July 13, 2024 / 7:32 PM IST

టీమిండియా విజయ ఢంకా
హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన నాలుగో టీ20 మ్యాచులో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జింబాబ్వే ఇచ్చిన 153 పరుగుల లక్ష్యాన్ని15.2 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది. యశస్వి జైస్వాల్ 93, శుభ్‌మన్ గిల్ 53 పరుగులు బాదారు. దీంతో టీమిండియా స్కోరు 15.2 ఓవర్లలో 156-0గా నమోదైంది.

10 ఓవర్లలో 106/0
టీమిండియా విజయం దిశగా దూసుకుపోతోంది. 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 106 పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్ 65, శుభ్‌మన్ గిల్ 37 పరుగులతో ఆడుతున్నారు.

యశస్వి హాఫ్ సెంచరీ
టీమిండియా ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. పవర్ ప్లేలో 6 ఓవర్లు ముగిసే నాటికి 61 పరుగులు చేశారు. యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ బాదాడు. యశస్వి 52, శుభ్‌మన్ గిల్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.

టీమ్ఇండియా టార్గెట్ 153
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 152 ప‌రుగులు చేసింది. జింబాబ్వే బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ సికింద‌ర్ ర‌జా (46; 28 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తడివానాషే మారుమణి (32), వెస్లీ మాధేవెరే (25)లు ఫ‌ర్వాలేద‌నిపించారు. భార‌త బౌల‌ర్ల‌లో ఖ‌లీల్ అహ్మ‌ద్ రెండు వికెట్లు తీశాడు. వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, తుషార్ దేశ్ పాండే, అభిషేక్ శ‌ర్మ‌, శివ‌మ్ దూబె లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

సికింద‌ర్ రజా ఔట్‌.. 
తుషార్ దేశ్ పాండే బౌలింగ్‌లో శుభ్ మ‌న్ గిల్ క్యాచ్ అందుకోవ‌డంతో సికింద‌ర్ ర‌జా (46) ఔట్ అయ్యాడు. దీంతో 18.3వ ఓవ‌ర్‌లో 141 ప‌రుగుల వ‌ద్ద జింబాబ్వే ఐదో వికెట్ కోల్పోయింది.

కాంప్‌బెల్ ర‌నౌట్‌.. 
జింబాబ్వే వ‌రుస‌గా వికెట్లు కోల్పోతుంది. సికింద‌ర్ ర‌జాతో స‌మ‌న్వ‌య లోపంతో కాంప్‌బెల్ (3) ర‌నౌట్ అయ్యాడు. దీంతో 14.4వ ఓవ‌ర్‌లో 96 ప‌రుగుల వ‌ద్ద జింబాబ్వే నాలుగో వికెట్ల కోల్పోయింది.

బ్రియాన్ బెన్నెట్ ఔట్‌.. 
వాషింగ్ట‌న్ సుంద‌ర్ బౌలింగ్‌లో య‌శ‌స్వి జైస్వాల్ క్యాచ్ అందుకోవ‌డంతో బ్రియాన్ బెన్నెట్ (9) ఔట్ అయ్యాడు. దీంతో 13.4వ ఓవ‌ర్‌లో 92 ప‌రుగుల వ‌ద్ద జింబాబ్వే మూడో వికెట్ కోల్పోయింది.

వెస్లీ మాధేవెరే ఔట్‌.. 
జింబాబ్వే మ‌రో వికెట్ కోల్పోయింది. శివ‌మ్ దూబె బౌలింగ్‌లో రింకూ సింగ్ క్యాచ్ అందుకోవ‌డంతో వెస్లీ మాధేవెరే(25) ఔట్ అయ్యాడు. దీంతో 9.6వ ఓవ‌ర్‌లో 67 ప‌రుగుల వ‌ద్ద జింబాబ్వే రెండో వికెట్ కోల్పోయింది.

మారుమణి ఔట్‌..
అభిషేక్ శ‌ర్మ బౌలింగ్‌లో రింకూ సింగ్ క్యాచ్ అందుకోవ‌డంతో తడివానాషే మారుమణి (32) ఔట్ అయ్యాడు. దీంతో 8.4వ ఓవ‌ర్‌లో 63 ప‌రుగుల వ‌ద్ద జింబాబ్వే తొలి వికెట్ కోల్పోయింది.

పవ‌ర్ ప్లే పూర్తి.. 
జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ప‌వ‌ర్ ప్లే పూర్తి అయింది. 6 ఓవ‌ర్ల‌కు జింబాబ్వే స్కోరు 44/0. వెస్లీ మాధేవెరే(19), తడివానాషే మారుమణి (18) లు నిల‌క‌డ‌గా ఆడుతున్నారు.

జింబాబ్వే తుది జ‌ట్టు : వెస్లీ మాధేవెరే, తడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్‌), జోనాథన్ కాంప్‌బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్ కీప‌ర్‌), రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ, టెండై చతారా

భారత తుది జ‌ట్టు : యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌), రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ఖలీల్ అహ్మద్

India vs Zimbabwe : ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హ‌రారే వేదిక‌గా భార‌త్, జింబాబ్వే జ‌ట్లు మ‌ధ్య నాలుగో టీ20 మ్యాచ్ జ‌రుగుతోంది. సిరీస్‌లో 2-1ఆధిక్యంలో ఉన్న భార‌త్ ఈ మ్యాచ్‌లోనూ విజ‌యం సాధించి మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సిరీస్‌ను సొంతం చేసుకోవాల‌ని భావిస్తుంది. మ‌రోవైపు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను స‌మం చేయాల‌ని జింబాబ్వే ప‌ట్టుద‌ల‌తో ఉంది. టీమ్ఇండియా టాస్ గెలిచింది. కెప్టెన్ గిల్ మ‌రో ఆలోచ‌న లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో జింబాబ్వే తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది.