India will beat Australia by 1 run to win Champions Trophy 2025 Michael Clarke prediction
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ నిలుస్తుందని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైఖేల్ కార్ల్క్ తెలిపాడు. అది కూడా ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఒక్క పరుగు తేడాతో ఓడిస్తుందని జోస్యం చెప్పాడు.
భారత్, ఆస్ట్రేలియా జట్లు వన్డే ప్రపంచకప్ 2023 పైనల్‌లో తలపడ్డాయి. నాటి ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచింది. నాటి ఫైనల్‌కు ఘన ప్రతీకారం తీర్చుకోవాలని సగటు భారత అభిమాని కోరుకుంటున్నాడు. ఒకవేళ ఫైనల్‌కు ఆస్ట్రేలియా వస్తే.. చిత్తు చిత్తుగా ఓడించాలని కామెంట్లు చేస్తున్నారు. అయితే.. కార్ల్క్ మాట్లాడుతూ భారత్ మరీ అంత భారీ తేడాతో గెలవలేదని చెబుతున్నాడు.
రెవ్‌స్పోర్ట్జ్ నిర్వహించిన టాటా స్టీల్ ట్రైబ్లేజర్స్ కాన్‌క్లేవ్‌లో మాట్లాడుతూ క్లార్క్ మాట్లాడుతూ.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో ఆస్ట్రేలియా, భారత్ లు తలపడతాయని అంచనా వేశాడు. దుబాయ్‌లోని పరిస్థితులు స్పిన్నర్లకు ఎక్కువ అనుకూలం అని, భారత స్పిన్నర్లు మెరుగ్గా రాణిస్తుండడంతో భారత్‌కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా తలపడతాయని అనుకుంటున్నాను. వాస్తవానికి నేను ఆస్ట్రేలియా గెలవాలని కోరుకుంటాను. కానీ.. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలుస్తుందని భావిస్తున్నాను. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే నంబర్ వన్ జట్టు. అయినప్పటికీ ఫైనల్‌లో భారత్ కేవలం 1 పరుగు తేడాతోనే గెలుస్తుంది. అని క్లార్క్ చెప్పాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు ఏ ఆటగాడు సాధిస్తాడు అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అని చెప్పాడు. కటక్‌లో సెంచరీతో రోహిత్ శర్మ తిరిగి ఫామ్ అందుకున్నాడు. అందులో ఎలాంటి సందేహం లేదన్నాడు. పవర్ ప్లేలో ఎలా ఆడాలో అతడి బాగా తెలుసు. ఎక్కువగా రిస్క్ తీసుకుంటూ మంచి ప్రారంభాలను అందిస్తూ ముందుకు సాగుతున్నాడు. టీమ్ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే, రోహిత్ శర్మ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచినా తాను ఆశ్చర్యపోను అని కార్ల్క్ తెలిపాడు.