SA-W vs IND-W : తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఓటమి..
దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత మహిళల జట్టు (SA-W vs IND-W )ఓటమితో మొదలు పెట్టింది.
India Women lost 1st t20 match against South Africa Women in 5 match series
- డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికా, భారత మహిళల జట్ల మధ్య తొలి మ్యాచ్
- ఓడిపోయిన టీమ్ఇండియా
- 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి సౌతాఫ్రికా
SA-W vs IND-W : దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత మహిళల జట్టు ఓటమితో మొదలు పెట్టింది. శుక్రవారం డర్బన్‌లోని కింగ్స్ మీడ్ వేదికగా దక్షిణాఫ్రికా మహిళలతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో హర్మన్ ప్రీత్ కౌర్ (47 నాటౌట్; 33 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా రోడ్రిగ్స్ (36; 29 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), ఫెఫాలీ వర్మ (34; 20 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) లు రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అయబోంగా ఖాకా మూడు వికెట్లు తీసింది. తుమీ సెఖుఖునే రెండు వికెట్లు పడగొట్టింది. ఎలంబా ఓ వికెట్ సాధించింది.
అనంతరం కెప్టెన్ లారా వోల్వార్ట్ (51; 39 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయగా అన్నేరీ డెర్క్సెన్ (44; 34 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్) రాణించడంతో 158 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా మహిళల జట్టు 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బౌలర్లలో శ్రేయాంకా పాటిల్ రెండు వికెట్లు తీసింది. అరుంధతి రెడ్డి, శ్రీచరణి చెరో వికెట్ పడగొట్టారు.
ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఆదివారం ఇదే వేదికపై జరగనుంది.
