ఐసీసీ వన్డే చాంపియన్‌షిప్‌లో భాగంగా ముంబై వేదికగా ఆడిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత మహిళా జట్టు సత్తా చాటింది. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన పోరులో 7 వికెట్ల తేడాతో విజయం సాధించి 2-0 లీడ్ దక్కించుకుంది. ఈ మ్యాచ్‌తో సిరీస్ విజయం ఖరారు అయిపోయినప్పటికీ నామమాత్రమైన మూడో వన్డే గురువారం ఫిబ్రవరి 28న జరగనుంది.
162 పరుగుల లక్ష్య చేధనకు దిగిన టీమిండియా ఆరంభంలో కాస్త నిదానించినా క్రమంగా ఊపందుకుంది. ఇటీవల ఐసీసీ ర్యాంకుల్లోనూ టాప్ 1గా నిలిచిన స్మృతి మంధాన మరోసారి విజృంభించి 63పరుగులు చేసింది. సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్(47)తో రెండో అత్యధిక స్కోర్ సాధించిన ప్లేయర్‌గా నిలిచింది. పూనమ్ రావత్.. మిథాలీతో కలిసి 73పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేసి మ్యాచ్‌కు హైలెట్ గా నిలిచింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 161 పరుగులు చేయగలిగింది. 130 పరుగులు చేస్తుందనుకుని భావించిన జట్టు నటాలి స్కైవర్ అద్భుతం చేసి 85 వ్యక్తిగత పరుగులతో టీమిండియా ముందు భారీ టార్గెట్‌ను ఉంచింది. జులన్ గోస్వామి, శిఖా పాండేలు చెరో 4వికెట్లు పడగొట్టారు.