భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
మౌంట్ మాంగనుయ్ : కాసేపట్లో భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. మౌంట్ మాంగనుయ్ వేదికగా మ్యాచ్ జరుగనుంది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి వన్డేలో విజయం సాధించిన టీమిండియా రెండో వన్డేలోనూ గెలుపొందాలనే తలంపుతో ఉంది. 5 వన్డేల సరీస్ లో భారత్ 1-0 అధిక్యంలో ఉంది.
భారత జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అంబటి రాయుడు, ధోని(వికెట్ కీపర్), కేదార్ జాదవ్, విజయ్ శంకర్, కుల్‌దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ.
కివీస్ జట్టు: మార్టిన్ గుప్తిల్, కాలిన్ మన్రో, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, టామ్ లాథమ్, హన్రీ నికోలస్, కాలిన్ గ్రాంధోమ్, డోగ్ బ్రేస్‌వెల్, ఇష్ సోధీ, లాకీ ఫెర్గ్యూషన్, ట్రెంట్ బోల్ట్.