Indian Cricketers Positive: ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా క్రికెటర్లకు కొవిడ్ పాజిటివ్

టీమిండియా క్రికెటర్‌కు ఇంగ్లాండ్ లో పర్యటనలో ఉండగా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ వ్యక్తిని హోం ఐసోలేషన్ లో ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు.

Indian Cricketers Positive: ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా క్రికెటర్లకు కొవిడ్ పాజిటివ్

Indian Cricketer Positive (1)

Updated On : July 15, 2021 / 9:51 AM IST

Indian Cricketers Positive: టీమిండియా క్రికెటర్లకు ఇంగ్లాండ్ లో పర్యటనలో ఉండగా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం వారిద్దరినీ హోం ఐసోలేషన్ లో ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఆ ప్లేయర్ ను మినహాయించి ఇండియా బృందం మొత్తాన్ని గురువారం బయోబబుల్‌కు పంపించనున్నారు.

ఒక ప్లేయర్ కు గొంతు నొప్పిగా ఉండటంతో టెస్టు చేయించగా పాజిటివ్ వచ్చింది. అతనితో కొద్ది రోజుల నుంచి కాంటాక్ట్ లో ఉన్న జట్టు సహచరులు, సపోర్ట్ స్టాఫ్ ను మూడు రోజుల పాటు ఐసోలేషన్ లో ఉంచారు. మరో వక్తికి లక్షణాలు కనిపించకపోయినా చేసిన టెస్టుల్లో పాజిటివ్ వచ్చింది.

బుధవారం చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో కోల్‌కతాలో సమావేశమయ్యారు. మీటింగ్ గురించి వివరాలు బయటకు వెల్లడించలేదు.

పాకిస్తాన్ జట్టుతో తొలి వన్డేకు ముందే ఇంగ్లాండ్ క్యాప్ లో ఏడుగురు జట్టు సభ్యులతో పాటు నలుగురు స్టాఫ్ మెంబర్లకు పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాతే ఇండియన్ క్రికెటర్లకు పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లు సమాచారం. ఈ వన్డే సిరీస్ లో ఇంగ్లాండ్.. పాకిస్తాన్ ను 3-0 తేడాతో ఓడించిన మాట వాస్తవమే కానీ బయోబబుల్ లోకి వైరస్ ఎలా వ్యాప్తి చెందిందనే దానిపై రెస్పాన్స్ లేదు.

ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టామ్ హారిసన్ మాట్లాడుతూ.. ‘డెల్టా వేరియంట్ గురించి జాగ్రత్త పడుతూ.. బయోసెక్యూర్ ఎన్విరాన్మెంట్ విషయంలో అలర్ట్ గా ఉంటున్నాం. మహమ్మారి వ్యాప్తి చెందేందుకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అందుకే ప్రొటోకాల్స్ తూచా తప్పకుండా పాటించాలనుకుంటున్నాం. ప్లేయర్లతో పాటు మేనేజ్మెంట్ స్టాఫ్ 14నెలల పాటు కఠినమైన నిబంధనలతో గడుపుతూ ఉన్నారు’ అని హారిసన్ అన్నాడు.