Sachin Tendulkar: కొత్త లగ్జరీ కారు కొన్న సచిన్ టెండూల్కర్.. వామ్మో అన్ని కోట్లా
సచిన్ కు కార్లంటే చాలా ఇష్టం. ఇప్పటికే తన ఇంటిలోని గ్యారేజీలో చాలా కార్లు ఉన్నాయి. అయినప్పటికీ తాజాగా మరో లగ్జరీ కారును టెండూల్కర్ కొనుగోలు చేశాడు.

Sachin Tendulkar
Sachin buys Lamborghini Urus S: క్రికెట్ దిగ్గజం, టీమ్ఇండియా మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar)ను అభిమానులు క్రికెట్ దేవుడిగా ఆరాధిస్తుంటారు. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ చేసిన ఆటగాడు సచిన్. అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు చేసిన మాస్టర్ బ్లాస్టర్‌క్రేజ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక సచిన్ కు కార్లంటే చాలా ఇష్టం. ఇప్పటికే తన ఇంటిలోని గ్యారేజీలో చాలా కార్లు ఉన్నాయి. అయినప్పటికీ తాజాగా మరో లగ్జరీ కారును టెండూల్కర్ కొనుగోలు చేశాడు.
అది అలాంటి ఇలాంటి కారు కాదు. లేటెస్ట్ టాప్ వేరియెంట్ మోడల్ లంబోర్ఘిని ఉరుస్ ఎస్((Lamborghini Urus S)) లగ్జరీ కారును సచిన్ కొన్నాడు. తన కొత్త కారులో ముంబై వీధుల్లో సచిన్ షికార్లు కొట్టాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. లంబోర్ఘిని ఉరుస్ ఎస్ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.4.18 కోట్లుగా ఉంది. ఇది 3.5 సెకన్లలో 0-100 కిమీ వేగం, 12.5 సెకన్లలో 0-200 కి.మీల వేగాన్ని అందుకోగలదు. గరిష్ట వేగం గంటకు 305 305 km/hగా ఉంది.
Sachin Tendulkar : ఫేక్ యాడ్స్ పై పోలీసులకు సచిన్ టెండూల్కర్ ఫిర్యాదు
కాగా.. ప్రముఖ కార్ల తయారీ సంస్థ అయిన బీఎండబ్ల్యూకి 2012 నుంచి సచిన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడంతో అతడి వద్ద ఎక్కువగా బీఎండబ్ల్యూ కార్లే ఉన్నాయి. బీఎండబ్ల్యూ 7 సిరీస్, బీఎండబ్ల్యూ ఎక్స్5 ఎమ్, బీఎండబ్ల్యూ ఐ8, బీఎండబ్ల్యూ 5 సిరీస్ వంటి లగ్జరీ కార్లు సచిన్ వద్ద ఉన్నాయి.
ఇదిలా ఉంటే సచిన్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ మెంటారుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. ఎలిమినేటర్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించిన ముంబై క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయి ఇంటి ముఖం పట్టింది. కాగా.. ఫైనల్‌లో గుజరాత్ ఓడి పోవడంతో చెన్నై ఐపీఎల్-16 సీజన్ విజేతగా నిలిచింది.
WTC Final 2023: అజింక్యా రహానేను ఊరిస్తున్న రికార్డులు.. ఏంటంటే..?