WTC Final 2023: అజింక్యా ర‌హానేను ఊరిస్తున్న రికార్డులు.. ఏంటంటే..?

అజింక్యా ర‌హానే(AjinkyaRahane)కు టెస్టు స్పెష‌లిస్టు అన్న ముద్ర ప‌డ‌డంతో చాలా కాలంగా అత‌డికి టీమ్ఇండియా త‌రుపున వ‌న్డేలు, టీ20ల్లో ఆడే అవ‌కాశం రావ‌డం లేదు. కేవ‌లం టెస్టులకే ప‌రిమితం అయ్యాడు. అనూహ్యంగా డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్న ర‌హానేను ప‌లు రికార్డులు ఊరిస్తున్నాయి.

WTC Final 2023: అజింక్యా ర‌హానేను ఊరిస్తున్న రికార్డులు.. ఏంటంటే..?

Ajinkya Rahane eye on records

WTC Final 2023-AjinkyaRahane: అజింక్యా ర‌హానే(AjinkyaRahane)కు టెస్టు స్పెష‌లిస్టు అన్న ముద్ర ప‌డ‌డంతో చాలా కాలంగా అత‌డికి టీమ్ఇండియా త‌రుపున వ‌న్డేలు, టీ20ల్లో ఆడే అవ‌కాశం రావ‌డం లేదు. కేవ‌లం టెస్టులకే ప‌రిమితం అయ్యాడు. అయితే పేల‌వ ఫామ్‌తో ఆ ఫార్మాట్‌లోనూ టీమ్ఇండియాలో చోటు కోల్పోయాడు. అదే స‌మ‌యంలో శ్రేయస్ అయ్య‌ర్(Shreyas Iyer), రిష‌బ్ పంత్(Rishabh Pant), ఇషాన్ కిష‌న్‌(Ishan Kishan) వంటి యువ ఆట‌గాళ్లు అద్భుతంగా రాణిస్తుండ‌డంతో ఇక జ‌ట్టులో ర‌హానేకు చోటు ద‌క్క‌ద‌ని అంతా భావించారు.

అయితే..ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL)లో చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) త‌రుపున అనుకోకుండా ద‌క్కిన అవ‌కాశాన్ని ర‌హానే రెండు చేతులా ఒడిసిప‌ట్టుకున్నాడు. 14 మ్యాచ్‌ల్లో 172.49 స్ట్రైక్ రేట్‌తో 326 పరుగులు చేశాడు. దీంతో అత‌డికి డబ్ల్యూటీసీ ఫైన‌ల్ ఆడే జ‌ట్టులో చోటు ద‌క్కింది. అటు శ్రేయ‌స్ అయ్య‌ర్ గాయ‌ప‌డ‌డం కూడా అత‌డికి క‌లిసి వ‌చ్చింది. దాదాపు 15 నెల‌ల త‌రువాత టీమ్ఇండియా త‌రుపున ర‌హానే బ‌రిలోకి దిగ‌నున్నాడు.

WTC Final 2023: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్లో ర‌వీంద్ర జ‌డేజా నో ఛాన్స్‌.. అశ్విన్‌ను తీసుకున్న‌ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్‌

లండ‌న్‌లోని ఓవ‌ల్ మైదానంలో జూన్ 7 నుంచి 11 వ‌ర‌కు భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇంగ్లాండ్‌లో ఆడిన అనుభ‌వం ఉండ‌డంతో పాటు మిడిల్ ఆర్డ‌ర్‌లో ర‌హానే కీల‌కం కావ‌డంతో అత‌డికి తుది జ‌ట్టులో దాదాపుగా చోటు ఖాయం. ఇదే స‌మ‌యంలో పలు రికార్డులు అత‌డిని ఊరిస్తున్నాయి. కాస్త క‌ష్ట‌ప‌డితే వీటిని ఫైన‌ల్ మ్యాచులోనే ర‌హానే అందుకునే అవ‌కాశం ఉంది.

5వేల ప‌రుగులు

ఇప్ప‌టి వ‌ర‌కు ర‌హానే టీమ్ఇండియా త‌రుపున 82 టెస్టులు ఆడాడు. 38.5 స‌గ‌టుతో 4,931 ప‌రుగులు చేశాడు. ఇందులో 12 శ‌తకాలు, 25 అర్ధ‌శత‌కాలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోరు 188. కాగా.. ర‌హానే మ‌రో 69 ప‌రుగులు చేస్తే టెస్టుల్లో 5 వేల ప‌రుగుల మైలురాయిని చేరుకుంటాడు.

WTC Final 2023: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు ముందు టీమ్ఇండియాకు ఓ గుడ్‌న్యూస్‌.. మ‌రో బ్యాడ్‌న్యూస్‌..!

100 క్యాచ్‌లు

బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా ఫీల్డింగ్‌లో ర‌హానే చురుకుగా ఉంటాడు అన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు అత‌డు 99 క్యాచ్‌లు ప‌ట్టుకున్నాడు. మ‌రొక్క క్యాచ్ అందుకుంటే 100 క్యాచ్‌లు అందుకున్న ఆట‌గాళ్ల జాబితాలో అత‌డు చోటు సంపాదిస్తాడు. మొత్తంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అజింక్యా ర‌హానే 12,865 పరుగులు చేశాడు. ఇంకో 135 పరుగుల చేస్తే 13 వేల ప‌రుగుల మార్క్‌ను అందుకుంటాడు.

ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ ముగిసిన అనంత‌రం ర‌హానే ఇంగ్లాండ్ బ‌య‌లుదేరి వెళ్లాడు. ప్రాక్టీస్ కూడా మొద‌లెట్టేశాడు.

WTC Final: రాజ‌స్థాన్ ఓపెన‌ర్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌..! అదృష్టం అంటే ఇత‌డిదే.. ఆ ఆట‌గాడి స్థానంలో..!