ODI World Cups : వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు వీరే..
వన్డే వరల్డ్ కప్‌లలో టీమ్ఇండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ఆటగాళ్లలో ఎవరో చూద్దాం..
![ODI World Cups : వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు వీరే.. ODI World Cups : వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు వీరే..](https://10tv.in/wp-content/uploads/2023/10/New-Project-8.jpg)
Virat Kohli - Rohit Sharma - Sachin Tendulkar
Most runs in ODI World Cups : మరో నాలుగు రోజుల్లో వన్డే ప్రపంచకప్ (ODI World Cup) 2023 ఆరంభం కానుంది. టీమ్ఇండియా (Team India) తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆడనుంది. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ క్రమంలో వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ భారత ఆటగాడు అత్యధిక పరుగులు చేశారో అని అభిమానులు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. వన్డే వరల్డ్ కప్‌లలో టీమ్ఇండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ఆటగాళ్లలో ఎవరో ఇప్పుడు చూద్దాం..
సచిన్ టెండూల్కర్..
వన్డే ప్రపంచకప్‌లలో భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ తన కెరీర్లో మొత్తం 6 వన్డే వరల్డ్ కప్‌లు ఆడాడు. మొత్తం 45 మ్యాచుల్లో 56.95 సగటుతో 88.98 స్ట్రైక్‌రేటుతో 2,278 పరుగులు చేశాడు. ఇందులో ఆరు శతకాలు, 15 అర్థశతకాలు ఉన్నాయి.
విరాట్ కోహ్లీ..
సచిన్ తరువాత వన్డే ప్రపంచకప్‌లలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ ఇప్పటి వరకు మూడు వన్డే ప్రపంచకప్(2011, 2015, 2019) లు ఆడాడు. 26 మ్యాచుల్లో 46.81 సగటుతో 86.70 స్ట్రైక్‌రేటుతో 1,030 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు 6 అర్థశతకాలు ఉన్నాయి.
సౌరవ్ గంగూలీ..
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మూడో స్థానంలో ఉన్నాడు. 21 మ్యాచుల్లో 55.88 సగటుతో 77.50 స్ట్రైక్‌రేటుతో 1,006 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు శతకాలు, మూడు అర్థశతకాలు ఉన్నాయి.
Asian Games : మరో రెండు స్వర్ణాలు.. ఆసియా క్రీడల్లో దూసుకుపోతున్న భారత్
రోహిత్ శర్మ..
భారత ప్రస్తుత కెప్టెన్ హిట్‌మ్యాన్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. 17 మ్యాచులు ఆడిన రోహిత్ 65.20 సగటుతో 95.97 స్ట్రైక్‌రేటుతో 978 పరుగులు చస్త్రశాడు. ఇందులో ఆరు శతకాలు, మూడు అర్థశతకాలు ఉన్నాయి.
రాహుల్ ద్రావిడ్..
టీమ్ఇండియా ప్రస్తుత హెచ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. 22 మ్యాచుల్లో 61.42 సగటుతో 74.97 స్ట్రైక్‌రేట్‌తో 860 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, ఆరు అర్థశతకాలు ఉన్నాయి.