Womens T20 World Cup Indian squad : మహిళల టీ20 ప్రపంచ కప్‌కు భారత జట్టు ప్రకటన.. ఇద్దరు తెలుగమ్మాయిలకు చోటు..
Womens T20 World Cup 2026 : ఇంగ్లాండ్ వేదికగా జరిగే ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 మెగా టోర్నీకి బీసీసీఐ 15మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ఇద్దరు తెలుగు ప్లేయర్లకు అవకాశం దక్కింది.
Womens T20 World Cup Indian squad
- మహిళల టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన
- జట్టులో ఇద్దరు తెలుగు అమ్మాయిలకు చోటు
- ఇంగ్లాండ్ వేదికగా జూన్ 12న మెగా టోర్నీ ప్రారంభం
Womens T20 World Cup Indian squad : ఇంగ్లాండ్ వేదికగా జూన్ 12వ తేదీ నుంచి జరగనున్న టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ -2026 మెగా టోర్నీకి సంబంధించి బీసీసీఐ భారత మహిళా జట్టును ప్రకటించింది. మొత్తం 15మంది మహిళా క్రికెటర్లతో జట్టును ప్రకటించింది. ఈ జట్టులో కొత్త ఆటగాళ్లకు కూడా అవకాశం దక్కింది. జట్టుకు కెప్టెన్‌గా హర్మత్ ప్రీత్‌కౌర్ వ్యవహరించనుండగా.. వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన వ్యవహరించనున్నారు.
బీసీసీఐ తాజాగా ప్రకటించిన జట్టులో ఇద్దరు తెలుగు ప్లేయర్లకు అవకాశం దక్కింది. శ్రీచరణి, అరుంధతి రెడ్డిలకు టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కింది. గాయం కారణంగా కాష్వీ గౌతమ్, అమన్‌జోత్ కౌర్‌లకు చోటు దక్కలేదు. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడని పేసర్ నందిని శర్మకు జట్టులో చోటు దక్కడం, గాయం తరువాత వికెట్ కీపర్, బ్యాటర్ యస్తికా బాటియా తిరిగి జట్టులోకి రావడం హైలెట్స్‌గా చెప్పుకోవచ్చు.
టీ20 ప్రపంచ కప్ భారత జట్టు ఇదే..
హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతి పుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్, శ్రీచరణి, యాస్తికా భాటియా, నందిని శర్మ, అరుంధతి రెడ్డి, రేణుకాసింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్.
The wait is over! ⌛
🚨 Presenting #TeamIndia’s squad for the ICC Women’s T20 World Cup 2026 🇮🇳
Let’s bring out the cheers for #WomenInBlue 🤩#T20WorldCup pic.twitter.com/vZTGtqeTZL
— BCCI Women (@BCCIWomen) May 2, 2026
తొలి మ్యాచ్ పాకిస్థాన్‌తోనే..
ఇంగ్లాండ్ వేదికగా జరిగే టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్-ఏలో ఉన్న భారత్ లీగ్ దశలో తొలి మ్యాచ్ పాకిస్థాన్ జట్టుతో జూన్ 14న ఆడనుంది. 17వ తేదీన నెదర్లాండ్స్ జట్టుతో, 21వ తేదీన సౌతాఫ్రికా జట్టుతో, 25వ తేదీన బంగ్లాదేశ్ జట్టుతో 28వ తేదీన ఆస్ట్రేలియా జట్టుతో టీమిండియా తలపడనుంది. జూన్ 30వ తేదీన తొలి సెమీస్, జులై 2న రెండో సెమీస్ మ్యాచ్ లు జరుగుతాయి. జులై 5న ఫైనల్ కు మ్యాచ్ లార్డ్స్ మైదానంలో జరగనుంది.
