Mumbai Indians : ఏంది సామీ నువ్వు చెప్పేది.. చెన్నై చేతిలో ఓడిపోతే.. ముంబై అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందేనా? హార్దిక్‌కు ఎన్ని కష్టాలో!
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ చావో రేవో (Mumbai Indians ) మ్యాచ్‌కు సిద్ధమైంది.
Do you what happen if today Mumbai Indians lost match to Chennai Super Kings in IPL 2026 (pic credit@ipl)
- చెపాక్ వేదికగా నేడు చెన్నై వర్సెస్ ముంబై మ్యాచ్
- ముంబైకి ఇది చావో రేవో మ్యాచ్
- ఓడిపోతే ఇంటికే
Mumbai Indians : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ చావో రేవో మ్యాచ్‌కు సిద్ధమైంది. నేడు (మే 2) చెన్నైలోని చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గనుక ముంబై ఇండియన్స్ ఓడిపోతే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమిస్తుంది. అంతేకాకుండా ఈ సీజన్లో ఇంటి ముఖం పట్టిన తొలి జట్టుగా నిలుస్తుంది.
ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడింది. రెండు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. మరో 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో 4 పాయింట్లు ఉండగా నెట్‌రన్‌రేటు -0.784గా ఉంది. ఈ సీజన్లో నేటి చెన్నైతో మ్యాచ్‌లో కలిపి ముంబై ఇంకా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
Kyle Jamieson : ఇప్పుడు చూసితివా జేమీసన్.. బుడ్డోడిపైనా నీ ప్రతాపం .. చర్యలు తీసుకున్న బీసీసీఐ
గత సీజన్లు పరిశీలిస్తే ప్లేఆఫ్స్ కు చేరుకోవాలంటే 16 పాయింట్లు ఉండాల్సిందే. అప్పుడే కనీసం నాలుగో స్థానంతోనైనా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టవచ్చు. 14 పాయింట్లు ఉన్నప్పటికే కొన్ని జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నా కూడా అందుకు చాలా సమీకరణాలు కలిసి రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ముంబై ఖాతాలో 4 పాయింట్లు ఉన్నాయి. మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే అప్పుడు ఆ జట్టు ఖాతాలో 16 పాయిట్లు వచ్చి చేరుతాయి.
అంటే ఈ లెక్కన చెన్నైతో మ్యాచ్‌లో ముంబై గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం ఇంటి ముఖం పట్టాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం టాప్-4లో ఉన్న జట్లు పంజాబ్ కింగ్స్ (13), ఆర్సీబీ (12), ఎస్ఆర్హెచ్ (12), ఆర్ఆర్ (12) ఖాతాల్లో ఇప్పటికే 12 లేదా 12కు పైగా పాయింట్లు ఉన్నాయి. ఈ జట్లు అన్ని కూడా ఇంకో రెండు మ్యాచ్‌లు గెలిచినా అప్పడు ఆయా జట్ల ఖాతాల్లో 16 పాయింట్లు చేరతాయి.
Kl Rahul : ఏందయ్యా రాహుల్.. ధోని, రోహిత్, కోహ్లీలు ఉన్న ఎలైట్ జాజితాలోకి..
ఆర్ఆర్ మినహా మిగిలిన జట్లు అన్ని కూడా ఇంకో 5 లేదా 5కు పైగా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ప్రస్తుతం అవి ఉన్న ఫామ్‌ను పరిగణలోకి తీసుకుంది. ఇంకో రెండు మ్యాచ్‌లు ఆయా జట్లు గెలవడం పెద్ద కష్టం కాదు. కాబట్టి ముంబై ఖచ్చితంగా చెన్నై పై గెలవాల్సిందే లేదంటే ఈ సీజన్లో ఇంటి ముఖం పట్టిన తొలి జట్టుగా నిలుస్తుంది.
