IND vs AFG: బ్యాట్ ఝుళిపించిన విరాట్.. అఫ్గానిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. ఫొటో గ్యాలరీ..
IND vs AFG: ఆసియా కప్-2022లో భాగంగా గురువారం రాత్రి జరిగిన ఇండియా - అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లో ఇండియా ఘనవిజయం సాధించింది. భారత్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ వీరవిహారం చేయడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. దాదాపు మూడేళ్ల తర్వాత విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడు. 61 బంతుల్లో 122 పరుగులు చేశాడు. అందులో 12 ఫోర్లు, ఆరు సిక్స్ లు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ 71 శతకాలు సాధించాడు. అయితే టీ20 ఫార్మాట్లో మాత్రం ఇదే తొలి సెంచరీ. అన్ని ఫార్మాట్లలో శతకాలు చేసిన నాలుగో భారత్ బ్యాటర్ గా కోహ్లీ నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ లక్ష్యచేధనలో చతికిల పడింది. భారత్ బౌలర్ల దాటికి క్రిజ్‌లో అఫ్గాన్ బ్యాటర్లు నిలబడలేక పోయారు. ఫలితంగా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి అఫ్గాన్ 111 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఇండియా 101 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.



















