IPL 2019 వింత రనౌట్: ఇద్దరూ ఒకేవైపు పరిగెత్తారు

IPL 2019 వింత రనౌట్: ఇద్దరూ ఒకేవైపు పరిగెత్తారు

Updated On : April 19, 2019 / 9:09 AM IST

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ చిత్తుగా ఓడిపోయింది. ముంబై చేతిలో 40 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌లో ఓ వింత రనౌట్ నమోదైంది. 

రోహిత్ శర్మ అవుట్ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్‌తో భాగస్వామ్యం నెలకొల్పేందుకు క్వింటన్ డికాక్ ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో అక్సర్ పటేల్ బౌలింగ్‌లో గందరగోళానికి గురైన డికాక్ రనౌట్ అవగా.. కొద్దిసేపటికే సూర్యకుమార్ యాదవ్ కూడా ఔటైపోయాడు. 9.5 ఓవర్ల వద్ద అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ బంతిని పాయింట్ దిశగా ఫుష్ చేసి సింగిల్ కోసం క్రీజు వదిలి ముందుకు వచ్చాడు. 

అప్పటికే బంతి నేరుగా ఫీల్డర్ రబాడ చేతుల్లోకి వెళ్లిపోయింది. పరుగు చేయాలనే నిర్ణయం మార్చుకుని సూర్యకుమార్ వెనక్కి వెళ్లిపోయాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌ నుంచి పరుగెత్తుకుంటూ వచ్చిన డికాక్ కూడా నేరుగా కీపర్ ఎండ్‌వైపుకు వెళ్లిపోయాడు. దీంతో.. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు ఒకే ఎండ్‌వైపుకు చేరుకున్నారు. అప్పటికే బంతి అందుకున్న రబాడ.. కీపర్ పంత్‌ చేతికి బంతిని అందించాడు. పంత్,. సింపుల్‌గా బౌలర్ అక్షర్ పటేల్‌కి త్రో చేయడంతో డికాక్ పెవిలియన్ చేరుకోవాల్సి వచ్చింది.