ఐపీఎల్ 2019 సీజన్ 12 డే 2లో భాగంగా KKR, SRH తలపడుతున్నాయి. టాస్ గెలిచిన KKR ఫీల్డింగ్ ఎంచుకుంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్ కు వేదికైంది. 2 జట్లు బలంగా కనిపిస్తున్నాయి. కోల్ కతా బ్యాటింగ్, బౌలింగ్ లో పటిష్టంగా కనిపిస్తోంది. దినేష్ కార్తీక్ కెప్టెన్సీ లో కోల్ కతా, భువనేశ్వర్ సారథ్యంలో హైదరాబాద్ బరిలోకి దిగాయి. సన్ రైజర్స్ జట్టు డేవిడ్ వార్నర్ రాకతో మరింత బలపడింది. గాయం కారణంగా ఈ మ్యాచ్ కి విలియమ్సన్ దూరం అయ్యాడు. 2016 లో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో సన్ రైజర్స్ తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకుంది.
ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్ కి సహకరిస్తుంది. పిచ్ పై పచ్చిక తక్కువ ఉండి పగుళ్ల కారణంగా మ్యాచ్ సాగేకొద్ది పిచ్ లో టర్న్ పెరుగుతుంది. స్పిన్నర్లకి ఈ పిచ్ బాగా కలిసొస్తుంది. ఇప్పటివరకు ఈ 2 జట్ల మధ్య 15 మ్యాచ్ లు జరగ్గా.. కోల్ కతా దే పైచేయి. కోల్ కతా 9 మ్యాచ్ లు గెలవగా సన్ రైజర్స్ 6 మ్యాచ్ లు గెలిచింది.