IPL 2019: ఆ ఒక్క బంతికే 13 పరుగులెలా..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన టార్గెట్ ను కోల్ కతా నైట్ రైడర్స్ చేధించగలిగింది. రస్సెల్ రచ్ఛ జట్టుకు అద్భుతమైన విజయాన్ని తెచ్చిపెట్టింది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన టార్గెట్ ను కోల్ కతా నైట్ రైడర్స్ చేధించగలిగింది. రస్సెల్ రచ్ఛ జట్టుకు అద్భుతమైన విజయాన్ని తెచ్చిపెట్టింది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన టార్గెట్ ను కోల్ కతా నైట్ రైడర్స్ చేధించగలిగింది. రస్సెల్ రచ్ఛ జట్టుకు అద్భుతమైన విజయాన్ని తెచ్చిపెట్టింది. 13 బంతుల్లో 48 పరుగులతో విజయాన్ని శాసించాడు. ఈ సిక్సర్ల సునామీతో రెచ్చిపోయిన ధాటికి ఒక్క బంతికే 13 పరుగులు వచ్చి చేరాయి.
Read Also : తెలివి వాడితే బాగుండేది: బౌలర్లపై కోహ్లీ స్పందన
కోల్‌కతా 16 బంతుల్లో 53 పరుగులు చేయాల్సిన తరుణంలో సిరాజ్ 17వ ఓవర్ మూడో బాల్ వేశాడు. ఆ బంతి సిక్సర్‌గా వెళ్లినా దానిని అది నోబాల్ కావడంతో అంపైర్ సిరాజ్‌ను తప్పించి అతడి స్థానంలో వచ్చిన స్టాయినిస్‌కు బౌలింగ్ ఇచ్చాడు. అప్పటికే 7 పరుగులు వచ్చి చేరాయి. ఆ తర్వాత సిరాజ్ నోబాల్ వేయడంతో స్టాయినిస్ బౌలింగ్‌లో రసెల్‌కు ఫ్రీహిట్ ఛాన్స్ వచ్చింది.
ఆ బంతిని రసెల్ సిక్సర్‌గా మలిచాడు. ఇలా మూడు బంతులు వేసినప్పటికీ ఒక్క బంతి మాత్రమే సరైనది కావడంతో 13 పరుగులు వచ్చినట్లు అయింది. కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ లో మరో మ్యాచ్ ను ఏప్రిల్ 7న రాజస్థాన్ వేదికగా ఆడనుంది. లీగ్ లో ఇది 21వ మ్యాచ్ కాగా, కేకేఆర్ నాలుగింటిలో 3 మ్యాచ్ లు గెలిచి 6 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.
Read Also : ఆర్బీబీ పతనమయ్యేలా చేసిన హైదరాబాద్ ప్లేయర్