ఐపీఎల్ 2019 పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. భారత్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల పూర్తి షెడ్యూల్ విడుదల కోసం వేచి చూసిన బీసీసీఐ… ఎట్టకేలకు పూర్తి వివరాలతో కూడిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. మార్చి 23నుంచి ఆరంభం కానున్న ఐపీఎల్ లీగ్ దశ మ్యాచ్‌లు మే 5 వరకూ జరగనున్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలి మ్యాచ్‌ను ఐపీఎల్ ఆరంభమైన రెండో రోజు మార్చి 24న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో కోల్‌కతా వేదికగా ఆడనుంది. హైదరాబాద్‌లోనే సన్‌రైజర్స్ 7 మ్యాచ్‌లు ఆడనుంది. కాగా, మార్చి 19న బీసీసీఐ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. సన్‌రైజర్స్ షెడ్యూల్ ఇలా ఉంది.
24 మార్చి కోల్‌కతా వేదికగా నైట్ రైడర్స్‌తో..
29 మార్చి హైదరాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో..
31 మార్చి హైదరాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో..
04 ఏప్రిల్ ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో..
06 ఏప్రిల్ హైదరాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో..
08 ఏప్రిల్ మొహాలీ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో..
14 ఏప్రిల్ హైదరాబాద్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో..
17 ఏప్రిల్ హైదరాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో..
21 ఏప్రిల్ హైదరాబాద్ వేదికగా నైట్ రైడర్స్‌తో..
23 ఏప్రిల్ చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో..
27 ఏప్రిల్ జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో..
29 ఏప్రిల్ హైదరాబాద్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో..
02 మే ముంబై వేదికగా ముంబై ఇండియన్స్‌తో..
04 మే బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో..
బాల్ ట్యాంపరింగ్ కారణంగా గతేడాది లీగ్‌కు దూరమైన వార్నర్ ఈ ఏడాది నుంచి మళ్లీ అందుబాటులోకి రానున్నాడు. మరో హిట్టర్ ధావన్‌ను వదులుకున్న హైదరాబాద్ జట్టులో కీలకమార్పులతో బరిలోకి దిగనుంది.
Here’s the full schedule of our #VivoIPL 2019 season!
Save the dates, #OrangeArmy ? pic.twitter.com/3KpKIR3cZQ
— SunRisers Hyderabad (@SunRisers) March 19, 2019