CSK: 2008 తర్వాత ఇన్నేళ్లకు జెర్సీ మార్పు.. ఆర్మీ సేవలకు గౌరవాన్ని కల్పిస్తూ..

చెన్నై సూపర్ కింగ్స్ ఇన్ని సంవత్సరాల తర్వాత జెర్సీ డిజైన్ మార్చుకుని బరిలోకి రానుంది. ఆరంభోత్సవ ఎడిషన్ 2008 తర్వాత పాత డిజైన్ నే ఏటా కొనసాగిస్తూ వస్తుంది. ఏప్రిల్ 9న మొదలుకానున్న 2021 వివో ఐపీఎల్ సీజన్ కోసం..

Ipl 2021 Csk Redesigns Jersey For The First Time Since 2008

CSK: చెన్నై సూపర్ కింగ్స్ ఇన్ని సంవత్సరాల తర్వాత జెర్సీ డిజైన్ మార్చుకుని బరిలోకి రానుంది. ఆరంభోత్సవ ఎడిషన్ 2008 తర్వాత పాత డిజైన్ నే ఏటా కొనసాగిస్తూ వస్తుంది. ఏప్రిల్ 9న మొదలుకానున్న 2021 వివో ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కోసం రెడీ అయిన జెర్సీని పట్టుకున్న టీం కెప్టెన్ ఫొటోను సీఎస్కే సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

జెర్సీ కొత్త లుక్‌లో కీలక అంశాలు జోడించి ఇండియన్ ఆర్మీ బలగాలకు గౌరవం కల్పించారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ లోగోలోనూ మార్పులు చేస్తూ పైన 3స్టార్స్ ను ఏర్పాటు చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ ఇండియన్ ఆర్మీని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది.

2019ఐపీఎల్ సీజన్ ఆరంభంలో రూ.2కోట్ల చెక్ ను ప్రజెంట్ చేసింది కూడా. టీం కెప్టెన్ కు ఇప్పటికే లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉండి పారాచూట్ రెజిమెంట్, టెర్రిటోరియల్ ఆర్మీ విభాగాల్లో ట్రైనింగ్ తీసుకున్నాడు.

ఇక జెర్సీ భుజాలపై ఆర్మీ సైనికుల దుస్తుల డిజైన్ తో.. బంగారపు అంచులతో జెర్సీ హై స్టాండర్డ్ లో కనిపిస్తుంది. సీఎస్కే ఆరు సార్లు ఫెయిర్ ప్లే అవార్డ్ అందుకోవడంతో పాటు లోగోపై ఉన్న మూడు స్టార్లు 2010, 2011, 2018లలో ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న దానికి నిదర్శనం. ఇక ఫైనల్స్ కు 8సార్లు చేరుకున్న ఈ టీం.. 10సీజన్లలో ప్లే ఆఫ్ వరకూ వెళ్లింది.

నిస్వార్థమైన సేవ చేసే ఆర్మీ బలగాలపై అవగాహన కల్పించేందుకు కొంత సమయం కేటాయించాలి. వారి సేవకు నిదర్శనంగా కాస్త ప్రశంసలు ఇవ్వాలి. వాళ్లు నిజమైన హీరోలు అని సీఎస్కే సీఈఓ కేఎస్ విశ్వనాథన్ అన్నారు.

Myntra, The India Cements Limitedలు 75ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, గల్ఫ్, నిప్పొన్ పెయింట్, ఎస్ఎన్జే, ఆస్ట్రల్ పైప్స్ లు ప్రధాన పెట్టుబడిదారులు కావడంతో జెర్సీపై వారి లోగోలను ఉంచారు.