IPL 2021: కోహ్లీ.. డివిలియర్స్ నా కోరిక తీర్చలేకపోయారు – సెహ్వాగ్
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కోరికను తీర్చలేకపోయారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ కోహ్లీ, డివిలియర్స్ లు.
IPL 2021: టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కోరికను తీర్చలేకపోయారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ కోహ్లీ, డివిలియర్స్ లు. అదేంటంటే.. ప్రస్తుత సీజన్ ఐపీఎల్ 2021లో విరాట్ కోహ్లీ.. డివిలియర్స్ కలిసి క్రీజులో బ్యాటింగ్ చేయలేదట. గ్లెన్ మ్యాక్స్ వెల్ రాగానే డివిలియర్స్ ఆర్డర్ మార్చేసింది ఆర్సీబీ.
ఇక దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ ఐదో స్థానంలో బ్యాటింగ్ కు దిగాడు. వన్ డౌన్‌లో రావాల్సిన విరాట్ కోహ్లీ.. ఓపెనింగ్ లో వచ్చి ఆశ్చర్యపరిచాడు. ఫలితంగా ఈ డిస్ట్రక్టివ్ బ్యాటర్స్ కలిసి బ్యాటింగ్ చేయడం కుదరలేదు. ఈ ప్రభావం కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ లో స్పష్టంగా కనిపించిందని వీరేందర్ సెహ్వాగ్ వీరూగిరీ డాట్ కామ్ లో చెప్పుకొచ్చారు.
‘విరాట్.. డివిలియర్స్ కలిసి ఆడతారని అనుకున్నా. ఈ సీజన్ లో అది మాత్రం కుదరలేదు. దేవదత్, విరాట్ కలిసి తొలి 5ఓవర్లలో 49పరుగులు చేసి శుభారంభం నమోదు చేశారు’
…………………………………………….: విద్యుత్‌లో కోతలు.. పరిశ్రమలతో డిస్కంలు సంప్రదింపులు!
‘లాకీ చేతిలో దేవదత్ అవుట్ అయ్యాడు. తర్వాత దిగిన భరత్ గత మ్యాచ్ లో ప్రదర్శనను కూడా చూపించకపోవడంతో బ్యాటింగ్ విభాగం స్లో అయిపోయింది’ అని చెప్తూ.. తన ట్విట్టర్ లో ఒక పోస్టు కూడా చేశాడు. ఎప్పుడూ ఈ సాలా కప్ నమ్‌దే (ఈ సారి కప్పు మనదే) అనే కొటేషన్ కు బదులు ఈ సాలా కప్ జాన్‌దే. (ఈ సారి కప్పు వదిలేద్దాం). అని రాస్తూ పోస్టు పెట్టాడు.