IPL 2021 SRH Vs RCB వాటే మ్యాచ్.. బెంగళూరుపై హైదరాబాద్ గెలుపు

ఐపీఎల్ 2021 సెకండాఫ్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో అనూహ్యంగా హైదరాబాద్ గెలిచింది. 4 పరుగుల తేడాతో బెంగళూరుపై విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ ని

IPL 2021 SRH Vs RCB వాటే మ్యాచ్.. బెంగళూరుపై హైదరాబాద్ గెలుపు

Sunrisers Beats Bangalore

Updated On : October 7, 2021 / 12:16 AM IST

IPL 2021 SRH Vs RCB : ఐపీఎల్ 2021 సెకండాఫ్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో అనూహ్యంగా హైదరాబాద్ గెలిచింది. 4 పరుగుల తేడాతో బెంగళూరుపై విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ ని ఆర్సీబీ గెలిచేలా కనిపించింది. ఇంతలో సీన్ మారిపోయింది. హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో కోహ్లి గ్యాంగ్ కి ఓటమి తప్పలేదు. 142 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 136 పరుగులే చేసింది. విజయానికి 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది.

AB de Villiers

హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జేసన్ హోల్డర్, సిద్ధార్థ్ కౌల్, ఉమ్రాన్ మాలిక్, రషీద్ ఖాన్ చెరో వికెట్ తీశారు. ఆర్సీబీ జట్టులో ఓపెనర్ దేవదత్ పడిక్కల్ 52 బంతుల్లో 41 పరుగులతో శుభారంభం ఇచ్చాడు. మ్యాక్స్ వెల్ 25 బంతుల్లో 40 పరుగులు మెరుపులు మెరిపించాడు. డివిలియర్స్ 13 బంతుల్లో 19 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కానీ లాభం లేకపోయింది. పెద్ద టార్గెట్ కాకపోయినా, ఆర్సీబీ తడబడింది.

WHO Warning : ముప్పు ఇంకా తొలగలేదు, కరోనాపై డబ్ల్యూహెచ్ఓ తాజా హెచ్చరిక

తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 14 పరుగుల దగ్గర అభిషేక్ శర్మ (13) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో కలిసి ఓపెనర్ జేసన్ రాయ్ నిలకడగా ఆడాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 70 పరుగులు జోడించాడు.

Glenn Maxwell

ఈ క్రమంలో 29 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేసిన విలియమ్సన్.. హర్షల్ పటేల్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. అప్పటికి 84 పరుగులతో పటిష్ఠంగా కనిపించింది. అయితే, 105 పరుగుల దగ్గర ప్రియం గార్గ్ (15) అవుటైన తర్వాత మ్యాచ్ స్వరూపం మారిపోయింది. వరుస పెట్టి వికెట్లు కోల్పోతూ భారీ స్కోరు చేసే అవకాశాన్ని హైదరాబాద్ కోల్పోయింది.

Lion Fish : బాబోయ్.. ఈ చేప చాలా డేంజర్.. విషం చిమ్మి మనిషిని చంపేస్తుంది!

జేసన్ రాయ్ 44 పరుగులు చేసి అవుట్ కాగా, సమద్ (1), సాహా (10), హోల్డర్ (16) క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు. దీంతో హైదరాబాద్ ఇన్నింగ్స్ 141/7 దగ్గర ముగిసింది. ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు పడగొట్టగా, డేనియల్ క్రిస్టియన్ 2, చాహల్, గార్టన్ చెరో వికెట్ తీశారు.

Kane Williamson and Jason Roy