IPL 2022 Auction: రూ.562కోట్లతో 10 జట్లు, రెండ్రోజుల వేలం పూర్తి వివరాలు
బెంగళూరు వేదికగా ఐపీఎల్ 2022 వేలం నేడు (ఫిబ్రవరి 12), రేపు జరగనుంది. రెండ్రోజుల పాటు గార్డెన్ సిటీ వేదికగా పది ఫ్రాంచైజీల ప్రతినిధులు వేలంలో పాల్గొంటున్నారు. 590 మంది ప్లేయర్లు...
IPL 2022 Auction: బెంగళూరు వేదికగా ఐపీఎల్ 2022 వేలం నేడు (ఫిబ్రవరి 12), రేపు జరగనుంది. రెండ్రోజుల పాటు గార్డెన్ సిటీ వేదికగా పది ఫ్రాంచైజీల ప్రతినిధులు వేలంలో పాల్గొంటున్నారు. బీసీసీఐ 590 మంది ప్లేయర్లను షార్ట్ లిస్టు చేయగా.. రూ.562కోట్ల బడ్జెట్ తో రెడీ అయ్యాయి యాజమాన్యాలు. ఈ ప్లేయర్లలో 370మంది ఇండియాకు చెందిన వారే.
2018 నుంచి దాదాపు రూ.90గరిష్ఠ మొత్తంతోనే వ్యవహరిస్తున్నాయి ఒక్కో ఫ్రాంచైజీ. ఆ లెక్కలు ఈ ఏడాదితో తారుమారు కానున్నాయి. కేఎల్ రాహుల్ ఈ ఏడాది కాస్ట్లియస్ట్ ప్లేయర్ గా నిలవనున్నాడని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే లక్నో సూపర్ జెయింట్స్ రూ.16కోట్లకు సొంతం చేసుకుందట.
ఇక షార్ట్ లిస్ట్ అయిన 590మంది ప్లేయర్లలో 228మంది క్యాప్‌డ్ ప్లేయర్లు కాగా, 355మంది అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు వారిలో ఏడుగురు మాత్రం అసోసియేట్ నేషన్స్ కు చెందిన వారు.
మోస్ట్ డిమాండబుల్ గా నిలిచిన 10మంది ప్లేయర్లలో రవిచంద్రన్ అశ్విన్, శ్రేయాస్ అయ్యర్ లు కూడా ఉన్నారు.
Read Also : కేసీఆర్ యాదాద్రి పర్యటన, రాయగిరిలో బహిరంగ సభ
వేలానికి ముందే అంటిపెట్టుకున్న ప్లేయర్లు జట్ల వారీగా:
చెన్నై సూపర్ కింగ్స్ (CSK): రవీంద్ర జడేజా (16 కోట్లు), ఎంఎస్ ధోని (12 కోట్లు), మొయిన్ అలీ (8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్ (6 కోట్లు)
కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్): ఆండ్రీ రస్సెల్ (12 కోట్లు), వరుణ్ చక్రవర్తి (8 కోట్లు, వెంకటేష్ అయ్యర్ (8 కోట్లు), సునీల్ నరైన్ (6 కోట్లు)
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH): కేన్ విలియమ్సన్ (14 కోట్లు), అబ్దుల్ సమద్ (4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (4 కోట్లు)
ముంబై ఇండియన్స్ (MI): రోహిత్ శర్మ (16 కోట్లు), జస్ప్రీత్ బుమ్రా (12 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (8 కోట్లు), కీరన్ పొలార్డ్ (6 కోట్లు)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB): విరాట్ కోహ్లీ (15 కోట్లు), గ్లెన్ మాక్స్‌వెల్ (11 కోట్లు), మహ్మద్ సిరాజ్ ( 7 కోట్లు)
రాజస్థాన్ రాయల్స్ (RR): సంజు శాంసన్ (14 కోట్లు), జోస్ బట్లర్ (10 కోట్లు), యశస్వి జైస్వాల్ (4 కోట్లు)
పంజాబ్ కింగ్స్ (PBKS): మయాంక్ అగర్వాల్ (12 కోట్లు, 14 కోట్లు పర్స్ నుండి తీసివేయాలి), అర్ష్‌దీప్ సింగ్ (4 కోట్లు)
గుజరాత్ టైటాన్స్ (GT): హార్దిక్ పాండ్యా (15 కోట్లు), రషీద్ ఖాన్ (15 కోట్లు), మరియు శుభ్‌మన్ గిల్ (8 కోట్లు)
లక్నో సూపర్ జెయింట్స్ (LSG): కెఎల్ రాహుల్ (17 కోట్లు), మార్కస్ స్టోయినిస్ (9.2). కోటి) మరియు రవి బిష్ణోయ్ (4 కోట్లు).
ఇంకా జట్ల వద్ద మిగిలి ఉన్న మొత్తం
Chennai Super Kings వద్ద మిగిలి ఉంది రూ.48కోట్లు. ఓపెన్ ప్లేయర్లకు మిగిలిన ఖాళీలు 21. విదేశీ ప్లేయర్ల కోసం మిగిలి ఉన్న ఖాళీలు 7.
Delhi Capitals వద్ద మిగిలి ఉంది రూ.47.5కోట్లు. ఓపెన్ ప్లేయర్లకు మిగిలిన ఖాళీలు 21. విదేశీ ప్లేయర్ల కోసం మిగిలి ఉన్న ఖాళీలు 7.
Kolkata Knight Riders వద్ద మిగిలి ఉంది రూ.48కోట్లు. ఓపెన్ ప్లేయర్లకు మిగిలిన ఖాళీలు 21. విదేశీ ప్లేయర్ల కోసం మిగిలి ఉన్న ఖాళీలు 6.
Lucknow Super Giants వద్ద మిగిలి ఉంది రూ.59కోట్లు. ఓపెన్ ప్లేయర్లకు మిగిలిన ఖాళీలు 22. విదేశీ ప్లేయర్ల కోసం మిగిలి ఉన్న ఖాళీలు 7.
Mumbai Indians వద్ద మిగిలి ఉంది రూ.48కోట్లు. ఓపెన్ ప్లేయర్లకు మిగిలిన ఖాళీలు 21. విదేశీ ప్లేయర్ల కోసం మిగిలి ఉన్న ఖాళీలు 7.
Punjab Kings వద్ద మిగిలి ఉంది రూ.72కోట్లు. ఓపెన్ ప్లేయర్లకు మిగిలిన ఖాళీలు 23. విదేశీ ప్లేయర్ల కోసం మిగిలి ఉన్న ఖాళీలు 8.
Rajasthan Royals వద్ద మిగిలి ఉంది రూ.62కోట్లు. ఓపెన్ ప్లేయర్లకు మిగిలిన ఖాళీలు 22. విదేశీ ప్లేయర్ల కోసం మిగిలి ఉన్న ఖాళీలు 7.
Royal Challengers Bangalore వద్ద మిగిలి ఉంది రూ.57కోట్లు. ఓపెన్ ప్లేయర్లకు మిగిలిన ఖాళీలు 22. విదేశీ ప్లేయర్ల కోసం మిగిలి ఉన్న ఖాళీలు 7.
Sunrisers Hyderabad వద్ద మిగిలి ఉంది రూ.68కోట్లు. ఓపెన్ ప్లేయర్లకు మిగిలిన ఖాళీలు 22. విదేశీ ప్లేయర్ల కోసం మిగిలి ఉన్న ఖాళీలు 7.
Team Ahmedabad వద్ద మిగిలి ఉంది రూ.52కోట్లు. ఓపెన్ ప్లేయర్లకు మిగిలిన ఖాళీలు 22. విదేశీ ప్లేయర్ల కోసం మిగిలి ఉన్న ఖాళీలు 7.
ఒక్కో ఫ్రాంచైజీ తమ పర్స్ రూ.90 కోట్ల నుంచి కనీసం రూ.67.5 కోట్లు ఖర్చు చేయాలి.
* ఒక్కో జట్టులో కనిష్టంగా 18 మంది ఆటగాళ్లు, గరిష్టంగా 25 మంది
* ఆటగాళ్ల బేస్ ధర రూ. 2 కోట్ల నుంచి రూ. 20 లక్షల వరకు ఉంటుంది. జట్లకు తమ మాజీ ఆటగాళ్లను తిరిగి తీసుకురావడానికి రైట్ టు మ్యాచ్ కార్డ్‌లు అందుబాటులో లేవు.
* రూ. 2 కోట్లు అత్యధిక రిజర్వ్ ధరలో ఉండటానికి 48 మంది ఆటగాళ్లు స్వతహాగా ఈ బ్రాకెట్‌లో ఉంచడానికి ఒప్పుకున్నారు.
* వేలం జాబితాలో 20 మంది ఆటగాళ్లు రూ.1.5 కోట్ల రిజర్వ్ ధరతో ఉండగా, రూ. కోటి రిజర్వ్ ధరతో 34 మంది ఆటగాళ్లు క్రికెటర్ల ఉన్నారు.
* IPL 2022 వేలం రోజు 2వ రోజున 161 మంది ఆటగాళ్ల నిమిత్తం వేలం జరుగుతుంది.
* వేలంలో టై బ్రేకర్ ఉంది.
దేశాల వారీగా ప్లేయర్ల సంఖ్య.
Afghanistan దేశం నుంచి 17మంది.
Australia దేశం నుంచి 47మంది.
Bangladesh దేశం నుంచి 5మంది.
England దేశం నుంచి 24మంది.
Ireland దేశం నుంచి 5మంది.
New Zealand దేశం నుంచి 24మంది.
South Africa దేశం నుంచి 33మంది.
Sri Lanka దేశం నుంచి 23మంది.
West Indies దేశం నుంచి 34మంది.
Zimbabwe దేశం నుంచి ఒకరు
Namibia దేశం నుంచి ముగ్గురు
Nepal దేశం నుంచి ఒకరు.
Scotland దేశం నుంచి ఇద్దరు
USA దేశం నుంచి ఒకరు