IPL 2023, LSG vs CSK: మ్యాచ్ రద్దు.. ఇరు జట్లకు చెరో పాయింట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా లక్నో వేదికగా చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)తో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow super giants) తలపడుతోంది.

LSG vs CSK
IPL 2023, LSG vs CSK: చెన్నై సూపర్‌కింగ్స్, లక్నో జెయింట్స్ ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. నిబంధనల ప్రకారం ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.
LIVE NEWS & UPDATES
-
మ్యాచ్ రద్దు
చెన్నై సూపర్‌కింగ్స్, లక్నో జెయింట్స్ ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. నిబంధనల ప్రకారం ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
-
గౌతమ్ ఔట్.. మ్యాచ్‌కు వర్షం అడ్డంకి
లక్నో మరో వికెట్ కోల్పోయింది. పతిరణ వేసిన ఆఖరి ఓవర్లోని రెండో బంతికి రహానే క్యాచ్ అందుకోవడంతో కృష్ణప్ప గౌతమ్(1) ఔట్ అయ్యాడు. దీంతో 125 పరుగుల వద్ద లక్నో ఏడో వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో వర్షం కురవడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. పిచ్‌ను కవర్లతో కప్పారు. లక్నో ఇన్నింగ్స్‌లో నాలుగు బంతులే మిగిలి ఉన్నాయి. మ్యాచ్ నిలిపివేసే సమయానికి లక్నో స్కోరు 19.2 ఓవర్లలో 125/7. ఆయుష్ బదోని(59) క్రీజులో ఉన్నాడు.
-
బదోని అర్ధశతకం
దీపక్ చాహర్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి 30 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు బదోని. ఈ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లకు లక్నో స్కోరు 125/6. ఆయుష్ బదోని(59), కృష్ణప్ప గౌతమ్(1) క్రీజులో ఉన్నారు.
-
పూరన్ ఔట్
పతిరణ బౌలింగ్‌లో మొయిన్ అలీ క్యాచ్ అందుకోవడంతో నికోలస్ పూరన్(20) ఔట్ అయ్యాడు. దీంతో 103 పరుగుల(17.4వ ఓవర్) వద్ద లక్నో ఆరో వికెట్ కోల్పోయింది. 18 ఓవర్లకు లక్నో స్కోరు 105 /6. ఆయుష్ బదోని(39), కృష్ణప్ప గౌతమ్(1) క్రీజులో ఉన్నారు.
-
సిక్స్, ఫోర్
మహేశ్ తీక్షణ 17వ ఓవర్‌ను వేశాడు. ఈ ఓవర్లో బదోని ఓ సిక్స్, ఫోర్ కొట్టడంతో మొత్తంగా 15 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లకు లక్నో స్కోరు 98/5. ఆయుష్ బదోని(34), నికోలస్ పూరన్(19) క్రీజులో ఉన్నారు.
-
బదోని సిక్స్
15వ ఓవర్‌ను మహేశ్ తీక్షణ వేశాడు. రెండో బంతికి బదోని సిక్స్ కొట్టడంతో ఈ ఓవర్లో మొత్తం 11 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లకు లక్నో స్కోరు 73/5. ఆయుష్ బదోని(18), నికోలస్ పూరన్(16) క్రీజులో ఉన్నారు.
-
5 పరుగులు
13వ ఓవర్‌ను మహేశ్ తీక్షణ కట్టుదిట్టంగా వేయడంతో ఐదు పరుగులు వచ్చాయి. 13 ఓవర్లకు లక్నో స్కోరు 57/5. ఆయుష్ బదోని(7), నికోలస్ పూరన్(11) క్రీజులో ఉన్నారు.
-
నెమ్మదించిన పరుగుల వేగం
వికెట్లు కోల్పోతుండడంతో లక్నో పరుగుల వేగం తగ్గింది. జడేజా వేసిన 11 ఓవర్లో నాలుగు పరుగులు రాగా మోయిన్ అలీ వేసిన 12 ఓవర్లో కూడా 4 పరుగులే వచ్చాయి. 12 ఓవర్లకు లక్నో స్కోరు 52/5. ఆయుష్ బదోని(4), నికోలస్ పూరన్(9) క్రీజులో ఉన్నారు.
-
కరణ్ శర్మ ఔట్
లక్నో జట్టు వరుసగా వికెట్లు కోల్పోతుంది. పదో ఓవర్‌ను మొయిన్ అలీ వేయగా ఈ ఓవర్లోని నాలుగో బంతికి మొయిన్కే క్యాచ్ ఇచ్చి కరణ్ శర్మ(9) ఔట్ అయ్యాడు. దీంతో లక్నో 44 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది. 10 ఓవర్లకు లక్నో స్కోరు 44/5. ఆయుష్ బదోని(0), నికోలస్ పూరన్(4) క్రీజులో ఉన్నారు.
-
4 పరుగులు
తొమ్మిదో ఓవర్‌ను రవీంద్ర జడేజా వేశాడు.ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. 9 ఓవర్లకు లక్నో స్కోరు 42/4. కరణ్ శర్మ(8), నికోలస్ పూరన్(4) క్రీజులో ఉన్నారు.
-
నాలుగు పరుగులు
ఎనిమిదో ఓవర్‌ను మొయిన్ అలీ కట్టుదిట్టంగా వేయడంతో నాలుగు పరుగులే వచ్చాయి. 8 ఓవర్లకు లక్నో స్కోరు 38/4. కరణ్ శర్మ(6), నికోలస్ పూరన్(2) క్రీజులో ఉన్నారు.
-
మార్కస్ స్టోయినిస్ ఔట్
ఏడో ఓవర్‌ను రవీంద్ర జడేజా వేశాడు. ఐదో బంతికి మార్కస్ స్టోయినిస్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 34 పరుగుల వద్ద లక్నో నాలుగో వికెట్ కోల్పోయింది. 7 ఓవర్లకు లక్నో స్కోరు 34/4. కరణ్ శర్మ(4), నికోలస్ పూరన్(0) క్రీజులో ఉన్నారు.
-
వరుస బంతుల్లో వోహ్రా, కృనాల్ ఔట్
మహేశ్ తీక్షణ లక్నోకు భారీ షాక్ ఇచ్చాడు. ఒకే ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. నాలుగో బంతికి మనన్ వోహ్రా(10) క్లీన్ బౌల్డ్ కాగా, ఐదో బంతికి కృనాల్ పాండ్యా (0) రహానే క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు. దీంతో లక్నో 27 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. 6ఓవర్లకు లక్నో స్కోరు 31/3. కరణ్ శర్మ(3), మార్కస్ స్టోయినిస్(4) క్రీజులో ఉన్నారు.
-
వోహ్రా ఫోర్
ఐదో ఓవర్‌ను దీపక్ చాహర్ వేశాడు. ఈ ఓవర్లోని నాలుగో బంతిని వోహ్రా ఫోర్‌గా మలిచాడు. దీంతో ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లకు లక్నో స్కోరు 25/1. కరణ్ శర్మ(2), మనన్ వోహ్రా(9) క్రీజులో ఉన్నారు.
-
మేయర్స్ ఔట్
లక్నోకు భారీ షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న కైల్ మేయర్స్(14) ఔట్ అయ్యాడు. మోయిన్ అలీ బౌలింగ్‌లో రుతురాజ్ క్యాచ్ అందుకోవడంతో అతడు పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో లక్నో 18 పరుగుల(3.4వ ఓవర్) వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 4 ఓవర్లకు లక్నో స్కోరు 19/1. కరణ్ శర్మ(1), మనన్ వోహ్రా(4) క్రీజులో ఉన్నారు.
-
మేయర్స్ ఫోర్
మూడో ఓవర్‌ను దీపక్ చాహర్ వేశాడు. నాలుగో బంతిని మేయర్స్ బౌండరీకి తరలించడంతో 10 పరుగులు వచ్చాయి. 3 ఓవర్లకు లక్నో స్కోరు 16/0. కైల్ మేయర్స్(13), మనన్ వోహ్రా(3) క్రీజులో ఉన్నారు.
-
1 పరుగు
రెండో ఓవర్‌ను తుషార్ దేశ్‌పాండే వేశాడు. ఈ ఓవర్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. 2 ఓవర్లకు లక్నో స్కోరు 6/0. కైల్ మేయర్స్(4), మనన్ వోహ్రా(2) క్రీజులో ఉన్నారు.
-
మేయర్స్ ఫోర్
టాస్ ఓడిన లక్నో సూపర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. కైల్ మేయర్స్, మనన్ వోహ్రా లు ఓపెనర్లుగా వచ్చారు. మొదటి ఓవర్‌ను దీపక్ చాహర్ వేశాడు. ఆఖరి బంతికి మేయర్స్ ఫోర్ కొట్టడంతో మొత్తంగా 5 పరుగులు వచ్చాయి.
-
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(కెప్టెన్), దీపక్ చాహర్, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ
-
లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు
కైల్ మేయర్స్, మనన్ వోహ్రా, కరణ్ శర్మ, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా(కెప్టెన్), కృష్ణప్ప గౌతమ్, నవీన్-ఉల్-హక్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్
-
టాస్ గెలిచిన చెన్నై
టాస్ గెలిచిన చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో లక్నో తొలుత బ్యాటింగ్ చేయనుంది.
-
టాస్ ఆలస్యం
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా లక్నో వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. అయితే.. మైదానంలో వర్షం పడుతుంది. దీంతో టాస్ ఆలస్యంగా వేయనున్నారు.