IPL 2023, RR vs LSG: రాజస్థాన్‌పై లక్నో విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్‌లో భాగంగా సువాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) విజయం సాధించింది.

RR vs LSG
IPL 2023, RR vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్‌లో భాగంగా సువాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) విజయం సాధించింది.
LIVE NEWS & UPDATES
-
లక్నో విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్‌లో భాగంగా సువాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) విజయం సాధించింది.లక్నో నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులకే పరిమితమైంది. దీంతో లక్నో 10 పరుగుల తేడాతో గెలిచింది.
-
హిట్‌మయర్ ఔట్
రాజస్థాన్ రాయల్స్‌కు మరో వికెట్ కోల్పోయింది. రన్‌రేట్ పెరిగిపోతుండడంతో భారీ షాట్‌కు యత్నించిన హిట్‌మయర్(2) బౌండరీ లైన్ వద్ద రాహుల్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో 104 పరుగుల వద్ద రాజస్థాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 16 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 107/4. దేవదత్ పడిక్కల్ (6), రియాన్ పరాగ్(2) క్రీజులో ఉన్నారు.
-
కీలక సమయంలో బట్లర్ ఔట్
రాజస్థాన్ రాయల్స్‌కు భారీ షాక్ తగిలింది. క్రీజులో కుదురుకున్న ఓపెనర్ జోస్ బట్లర్(40) మార్కస్ స్టోయినిస్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి రవి బిష్ణోయ్ చేతికి చిక్కాడు. 14 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 99/3. దేవదత్ పడిక్కల్ (3), షిమ్రాన్ హిట్‌మయర్(1) క్రీజులో ఉన్నారు.
-
సంజు శాంసన్ రనౌట్
రాజస్థాన్ మరో వికెట్ పడింది. కెప్టెన్ సంజు శాంసన్ (2)రనౌట్ అయ్యాడు. దీంతో 93 పరుగుల వద్ద రాజస్థాన్ రెండో వికెట్ కోల్పోయింది. 13 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 95/2. దేవదత్ పడిక్కల్ (1), జోస్ బట్లర్(39) క్రీజులో ఉన్నారు.
-
యశస్వి జైశ్వాల్ ఔట్
మార్కస్ స్టోయినిస్ బౌలింగ్‌లో తొలి బంతికి సిక్స్ కొట్టిన జైశ్వాల్(44) అదే ఊపులో మరో షాట్‌కు యత్నించి అవేశ్ ఖాన్ చేతికి చిక్కాడు. 12 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 89/1. సంజు శాంసన్(2), జోస్ బట్లర్(35) క్రీజులో ఉన్నారు.
-
8 పరుగులు
అమిత్ మిశ్రా వేసిన పదకొండో ఓవర్‌లోని తొలి బంతిని బట్లర్ ఫోర్ బాదాడు. ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 81/0. జోస్ బట్లర్(35), యశస్వి జైస్వాల్(38) క్రీజులో ఉన్నారు.
-
బట్లర్ ఫోర్
అమిత్ మిశ్రా వేసిన తొమ్మిదో ఓవర్‌లోని మూడో బంతికి బట్లర్ ఫోర్ కొట్టాడు. ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. 9 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 68/0. జోస్ బట్లర్(28), యశస్వి జైస్వాల్(34) క్రీజులో ఉన్నారు.
-
10 పరుగులు
ఎనిమిదో ఓవర్‌ను రవి బిష్ణోయ్ వేశాడు. వరుసగా రెండు, మూడు బంతులను బట్లర్ ఫోర్లుగా మలిచాడు. ఈ ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. 8 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 60/0. జోస్ బట్లర్(22), యశస్వి జైస్వాల్(32) క్రీజులో ఉన్నారు.
-
పవర్ ప్లే
రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో పవర్ ప్లే ముగిసింది. అవేశ్ ఖాన్ వేసిన ఆరో ఓవర్‌లో జైశ్వాల్ రెండు ఫోర్లు కొట్టగా, బట్లర్ ఓ ఫోర్ బాదాడు. ఈ ఓవర్‌లో మొత్తం 13 పరుగులు వచ్చాయి. 6 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 47/0. జోస్ బట్లర్(15), యశస్వి జైస్వాల్(27) క్రీజులో ఉన్నారు.
-
11 పరుగులు
5 ఓవర్‌ను యుధ్వీర్ సింగ్ వేశాడు. ఈ ఓవర్‌లోని తొలి బంతికి జైశ్వాల్ ఫోర్ కొట్టగా నాలుగో బంతికి బట్లర్ సిక్స్ బాదాడు. మొత్తంగా ఈ ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 34/0. జోస్ బట్లర్(11), యశస్వి జైస్వాల్(18) క్రీజులో ఉన్నారు.
-
3 పరుగులు
తొలి ఓవర్‌లో రెండు పరుగులు మాత్రమే ఇచ్చిన నవీన్ ఉల్ హక్ తన రెండో ఓవర్‌లో మూడు పరుగులు ఇచ్చాడు. 3 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 21/0. జోస్ బట్లర్(4), యశస్వి జైస్వాల్(12) క్రీజులో ఉన్నారు.
-
జైశ్వాల్ ఫోర్, సిక్స్
రెండో ఓవర్‌ను యుధ్వీర్ సింగ్ వేశాడు. ఆఖరి రెండు బంతులను జైశ్వాల్ ఫోర్, సిక్స్‌గా మలిచాడు. మొత్తంగా ఈ ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి. 2 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 18/0. జోస్ బట్లర్(2), యశస్వి జైస్వాల్(11) క్రీజులో ఉన్నారు.
-
తొలి ఓవర్‌లో రెండు పరుగులు
లక్ష్యాన్ని ఛేదించేందుకు రాజస్థాన్ బరిలోకి దిగింది. ఓపెనర్లుగా జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగారు. తొలి ఓవర్‌ను నవీన్ ఉల్ హక్ వేశాడు. ఈ ఓవర్‌లో 2 పరుగులు మాత్రమే వచ్చాయి. మొదటి ఓవర్ ముగిసే సరికి రాజస్థాన్ స్కోరు 2/0. జోస్ బట్లర్(1), యశస్వి జైస్వాల్(1) క్రీజులో ఉన్నారు.
-
రాజస్థాన్ లక్ష్యం 155
సువాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ ముందు 155 పరుగుల లక్ష్యం నిలిచింది. లక్నో బ్యాటర్లలో కైల్ మేయర్స్ (51) అర్ధశతకంతో రాణించగా కేఎల్ రాహుల్ (39), నికోలస్ పూరన్ (28) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీయగా, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మలు తలా ఓ వికెట్ పడగొట్టారు.
-
పూరన్ దూకుడు
హోల్డర్ వేసిన 19వ ఓవర్‌లో పూరన్ రెండు ఫోర్లు ఓ సిక్స్ కొట్టాడు. ఈ ఓవర్‌లో 17 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లకు లక్నో స్కోరు 146/4. మార్కస్ స్టోయినిస్(21), నికోలస్ పూరన్(25 క్రీజులో ఉన్నారు.
-
స్టోయినిస్ ఫోర్
17వ ఓవర్‌ని సందీప్ శర్మ వేయగా రెండో బంతికి స్టోయినిస్ ఫోర్ కొట్టాడు. ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లకు లక్నో స్కోరు 123/4. మార్కస్ స్టోయినిస్(17), నికోలస్ పూరన్(6) క్రీజులో ఉన్నారు.
-
5 పరుగులు
15 వ ఓవర్‌ను చాహల్ వేశాడు. ఈ ఓవర్‌లో 5 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లకు లక్నో స్కోరు 109/4. మార్కస్ స్టోయినిస్(8), నికోలస్ పూరన్(2) క్రీజులో ఉన్నారు.
-
ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన అశ్విన్
ఒకే ఓవర్‌లో లక్నో జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. 14వ ఓవర్‌ను అశ్విన్ వేశాడు. రెండో బంతికి దీపక్ హుడా షాట్ ఆడగా షిమ్రాన్ హెట్మెయర్ చేతికి చిక్కాడు. ఐదో బంతికి కైల్ మేయర్స్ ను అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 14 ఓవర్లకు లక్నో స్కోరు 104/4. మార్కస్ స్టోయినిస్(5), నికోలస్ పూరన్(0) క్రీజులో ఉన్నారు.
-
కైల్ మేయర్స్ అర్ధశతకం
ఓపెనర్ కైల్ మేయర్స్ ఐపీఎల్‌లో మరో అర్ధశతకాన్ని అందుకున్నాడు. చాహల్ బౌలింగ్ నాలుగు, ఐదు బంతులకు ఫోర్లు కొట్టిన మేయర్స్ ఆఖరి బంతికి సింగిల్ తీసి 40 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. 13 ఓవర్లకు లక్నో స్కోరు 98/2. దీపక్ హుడా(2), కైల్ మేయర్స్(50) క్రీజులో ఉన్నారు.
-
ఆయుష్ బదోని క్లీన్ బౌల్డ్
రాజస్థాన్ బౌలర్లు పుంజుకున్నారు. వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీశారు. బౌల్ట్ బౌలింగ్‌లో ఆయుష్ బదోని(1) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 85 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్‌ను కోల్పోయింది. 12 ఓవర్లకు లక్నో స్కోరు 86/2. దీపక్ హుడా(1), కైల్ మేయర్స్(39) క్రీజులో ఉన్నారు.
-
రాహుల్ ఔట్
ఎట్టకేలకు రాజస్థాన్ బౌలర్లు వికెట్ పడగొట్టారు. జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో బట్లర్ క్యాచ్ అందుకోవడంతో కేఎల్ రాహుల్(39) ఔట్ అయ్యాడు. దీంతో లక్నో 82 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 11 ఓవర్లకు లక్నో స్కోరు 83/1. ఆయుష్ బదోని(0) , కైల్ మేయర్స్(39) క్రీజులో ఉన్నారు.
-
5 పరుగులు
పదో ఓవర్‌ను అశ్విన్ వేశాడు. ఈ ఓవర్‌లో 5 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లకు లక్నో స్కోరు 79/0. కేఎల్ రాహుల్(38), కైల్ మేయర్స్(37) క్రీజులో ఉన్నారు.
-
వేగం పెంచిన లక్నో బ్యాటర్లు
ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన లక్నో బ్యాటర్లు వేగం పెంచారు. చాహల్ వేసిన తొమ్మిదో ఓవర్‌లోని తొలి రెండు బంతులకు మేయర్స్ సిక్స్, ఫోర్ కొట్టగా ఐదో బంతిని రాహుల్ సిక్స్‌గా మలిచాడు. ఈ ఓవర్‌లో 18 పరుగులు వచ్చాయి. 9 ఓవర్లకు లక్నో స్కోరు 74/0. కేఎల్ రాహుల్(36), కైల్ మేయర్స్(35) క్రీజులో ఉన్నారు.
-
13 పరుగులు
లక్నో బ్యాటర్లు క్రమంగా దూకుడు పెంచుతున్నారు. జాసన్ హోల్డర్ వేసిన ఎనిమిదో ఓవర్‌లోని నాలుగో బంతికి మేయర్స్ సిక్స్ కొట్టగా, ఆఖరి బంతికి రాహుల్ ఫోర్ కొట్టాడు. ఈ ఓవర్‌లో మొత్తం 13 పరుగులు వచ్చాయి. 8 ఓవర్లకు లక్నో స్కోరు 56/0. కేఎల్ రాహుల్(29), కైల్ మేయర్స్(24) క్రీజులో ఉన్నారు.
-
పవర్ ప్లే
లక్నో ఇన్నింగ్స్‌లో పవర్ ప్లే పూర్తి అయ్యింది. ఆరో ఓవర్‌ను అశ్విన్ వేశాడు. ఐదో బంతిని రాహుల్ ఫోర్‌గా మలచడంతో ఈ ఓవర్‌లో మొత్తం 6 పరుగులు వచ్చాయి. 6 ఓవర్లకు లక్నో స్కోరు 37/0. కేఎల్ రాహుల్(19), కైల్ మేయర్స్(16) క్రీజులో ఉన్నారు.
-
సిక్స్, ఫోర్
కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్ క్రమంగా దూకుడు పెంచుతున్నారు. ఐదో ఓవర్‌ను బౌల్ట్ వేయగా మేయర్స్ ఓ సిక్స్, రాహుల్ ఓ ఫోర్ కొట్టారు. ఈ ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లకు లక్నో స్కోరు 31/0. కేఎల్ రాహుల్(14), కైల్ మేయర్స్(15) క్రీజులో ఉన్నారు.
-
4 పరుగులు
తన తొలి ఓవర్‌లో 12 పరుగులు ఇచ్చిన సందీప్ శర్మ రెండో ఓవర్‌లో మాత్రం నాలుగు పరుగులే ఇచ్చాడు. దీంతో 4 ఓవర్లకు లక్నో స్కోరు 18/0. కేఎల్ రాహుల్(8), కైల్ మేయర్స్(9) క్రీజులో ఉన్నారు.
-
రెండు పరుగులు
మూడో ఓవర్‌ను ట్రెంట్ బౌల్డ్ వేశాడు. ఈ ఓవర్‌లో రెండు పరుగులు రావడంతో 3 ఓవర్లకు లక్నో స్కోరు 14/0. కేఎల్ రాహుల్(6), కైల్ మేయర్స్(7) క్రీజులో ఉన్నారు.
-
రెండు ఫోర్లు
రెండో ఓవర్‌ను సందీప్ శర్మ వేయగా కైల్ మేయర్స్, రాహుల్ లు చెరో ఫోర్ కొట్టడంతో ఈ ఓవర్‌లో మొత్తం 12 పరుగులు వచ్చాయి. 2 ఓవర్లకు లక్నో స్కోరు 12/0. కేఎల్ రాహుల్(5), కైల్ మేయర్స్(5) క్రీజులో ఉన్నారు.
-
తొలి ఓవర్ మెయిడిన్
లక్నో జట్టు తొలుత బ్యాటింగ్ ఆరంభించింది. కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. మొదటి ఓవర్‌ను ట్రెంట్ బౌల్ట్ వేశాడు. ఈ ఓవర్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు.
-
రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు
జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
-
లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు
కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), ఆయుష్ బదోని, నవీన్-ఉల్-హక్, అవేష్ ఖాన్, యుధ్వీర్ సింగ్ చరక్, రవి బిష్ణోయ్
-
టాస్ గెలిచిన రాజస్థాన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌లో భాగంగా సువాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది.