Csk Vs Kkr : రెచ్చిపోయిన రుతురాజ్.. కోల్‌కతాపై చెన్నై విజయం

తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది.

Csk Vs Kkr : రెచ్చిపోయిన రుతురాజ్.. కోల్‌కతాపై చెన్నై విజయం

Csk Vs Kkr

Updated On : April 8, 2024 / 11:10 PM IST

Csk Vs Kkr : ఐపీఎల్ 2024లో భాగంగా కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలిచింది. 7 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. 138 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై.. 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. చెన్నై జట్టులో కెప్టెన్, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. రుతురాజ్ 58 బంతుల్లో 67 పరుగులు చేశాడు. శివమ్ దూబే (18 బంతుల్లో 28 పరుగులు), డారిల్ మిచెల్ (19 బంతుల్లో 25 పరుగులు) మెరుపులు మెరిపించారు.

వరుసగా రెండు ఓటముల తర్వాత చెన్నై జట్టు గెలుపు రుచి చూసింది. అటు హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన కేకేఆర్.. ఈ సీజన్ లో తొలి ఓటమి చవి చూసింది. చెన్నై చేతిలో పరాజయం పాలైంది.

స్కోర్లు..
కేకేఆర్-137/9(20 ఓవర్లు)
సీఎస్‌కే- 141/3(17.4 ఓవర్లు)