ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్ నుంచి ఆ జట్టు అధికారికంగా నిష్క్రమణ

IPL 2024: ఇప్పుడు కనీసం ప్లేఆఫ్స్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వకపోవడం గమనార్హం.

ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్ నుంచి ఆ జట్టు అధికారికంగా నిష్క్రమణ

pic credit @ ipl

ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టు అధికారికంగా వైదొలిగింది. ముంబై ఇండియన్స్ ఎలిమినేటెడ్ అని పాయింట్ల పట్టికలోనూ కనపడుతోంది. ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 12 మ్యాచులు ఆడి కేవలం నాలుగు మ్యాచుల్లోనే గెలుపొందింది. మిగతా ఎనిమిది మ్యాచుల్లో ఓడిపోయింది. రన్ రేట్ కూడా -0.212గా ఉంది.

పాయింట్ల పట్టికలో ఆ జట్టు తొమ్మిదో స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ ఐపీఎల్ చరిత్రలో ఐదుసార్లు విజయం సాధించింది. 2013, 2015, 2017, 2019, 2020లో కప్ సాధించింది. ఇప్పుడు కనీసం ప్లేఆఫ్స్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వకపోవడం గమనార్హం.

బుధవారం ఉప్పల్లో జరిగిన మ్యాచులో లక్నోపై హైదరాబాద్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అనంతరం ముంబై జట్టు అధికారికంగా నిష్క్రమించింది. ఇక హైదరాబాద్ జట్టు ఫ్లేఆఫ్స్ రేసులో స్థిరపడింది. ప్రస్తుతం హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.

పాయింట్ల పట్టిక

జట్టు మ్యాచులు గెలుపు ఓటమి పాయింట్లు నెట్

రన్‌రేట్

కేకేఆర్ 11 8 3 16 1.453
ఆర్ఆర్ 11 8 3 16 0.476
ఎస్ఆర్‌హెచ్ 12 7 5 14 0.406
సీఎస్కే 11 6 5 12 0.7
డీసీ 12 6 6 12 -0.316
ఎల్ఎస్జీ 12 6 6 12 -0.769
ఆర్సీబీ 11 4 7 8 -0.049
పంజాబ్ 11 4 7 8 -0.187
ముంబై* 12 4 8 8 -0.212
గుజరాత్ 11 4 7 8 -1.32

Also Read: హైదరాబాద్, లక్నో ఆటతీరుపై టాప్-10 ఫన్నీ మీమ్స్ ఇవే..