IPL 2024: సీఎస్కేను ఓడించినా ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కి వెళ్లదా?

IPL 2024: ఆర్సీబీ ప్లేఆఫ్ చేరాలంటే కష్టపడాల్సిందే. ఫాఫ్ డు ప్లెసిస్ సారథ్యంలోని ఆ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 200 పరుగుల కంటే ఎక్కువ సాధిస్తే.. కనీసం 18 పరుగుల తేడాతో సీఎస్కేని ఓడించాలి.

IPL 2024: సీఎస్కేను ఓడించినా ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కి వెళ్లదా?

RCB virat kohli

ఐపీఎల్ 2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 12 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. చెన్నైతో శనివారం జరిగే మ్యాచులో ఆర్సీబీ గెలిస్తే ప్లేఆఫ్‌కు వెళ్తుందని చాలా మంది అనుకుంటున్నారు. అయితే, ప్లేఆఫ్ చేరాలంటే ఆర్సీబీ తక్కువ పరుగులతోనూ గెలిస్తే సరిపోదు.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కోల్‌కతా నైట్ రైడర్స్ (19 పాయింట్లు), రాజస్థాన్ రాయల్స్ (16), సన్‌రైజర్స్ హైదరాబాద్ (15), చెన్నై సూపర్ కింగ్స్(14), ఢిల్లీ క్యాపిటల్స్ (14), ఆర్సీబీ (12 పాయింట్లు) వరుసగా ఉన్నాయి. ప్లేఆఫ్ లో స్థానం కోసం శనివారం చెన్నై, బెంగళూరు హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది.

ఈ రెండు జట్లకీ ఇది 14వ మ్యాచు. చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో 14 పాయింట్లతో పాటు నెట్ రన్ రేట్ +0.528 ఉంది. బెంగళూరు జట్టుకి 12 పాయింట్లు నెట్ రన్ రేట్ +0.387 ఉంది. దీంతో ఆర్సీబీ సాదాసీగా గెలిస్తే 14 పాయింట్లకు ఎగబాక వచ్చు గానీ, అదే సమయంలో నెట్ రన్ రేట్ పెంచుకోకపోతే ప్లేఆఫ్ వెళ్లలేదు. నెట్ రన్ రేట్ పెంచుకోండా ఆర్సీబీ మ్యాచులో గెలిచినా ప్లేఆప్ చేరేది చెన్నై జట్టు మాత్రమే.

ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేస్తే?
ఆర్సీబీ ప్లేఆఫ్ చేరాలంటే ఫాఫ్ డు ప్లెసిస్ సారథ్యంలోని ఆ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 200 పరుగుల కంటే ఎక్కువ సాధిస్తే, ఛేజింగ్ లో కనీసం 18 పరుగుల తేడాతో సీఎస్కేని ఓడించాలి. ఆర్సీబీ 17 పరుగులు లేదా అంతకంటే తక్కువ పరుగుల తేడాతో గెలిస్తే నెట్ రన్ రేట్ తక్కువగా వస్తుంది. దీంతో ఆర్సీబీ నాకౌట్ అవుతుంది.

ఆర్సీబీ మొదట బౌలింగ్ చేస్తే?
మొదట సీఎస్కే బ్యాటింగ్ చేసి 200 పరుగులు చేస్తే ఆర్సీబీ ధాటిగా ఆడి గెలవాల్సి ఉంటుంది. అంటే, ఆర్సీబీ ఛేజింగ్‌కు దిగితే 201 పరుగుల లక్ష్యాన్ని 11 బంతులు మిగిలి ఉండగానే చేరుకోవాలి. దీంతో ఆర్సీబీ ప్లేఆఫ్ వెళ్లడం అంత సులభమేమీ కాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు సీఎస్కేకే అధికంగా అనుకూలంగా ఉన్నాయి.

Also Read: సర్‌ప్రైజ్.. డూ ఆర్ డై మ్యాచ్ వేళ.. ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిన ధోనీ