RCB vs SRH Match Prediction : హ్యాట్రిక్ విజ‌యాల‌పై స‌న్‌రైజ‌ర్స్ క‌న్ను.. ఓడితే ప్లే ఆఫ్స్ రేసు నుంచి బెంగ‌ళూరు ఔట్‌

సోమ‌వారం బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు త‌ల‌ప‌డ‌నుంది.

RCB vs SRH : ఐపీఎల్ 2024లో మ‌రో ఆస‌క్తిక‌ర పోరుకు రంగం సిద్ద‌మైంది. సోమ‌వారం బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు త‌ల‌ప‌డ‌నుంది. ఈ సీజ‌న్‌లో బెంగ‌ళూరు జ‌ట్టు ఓట‌ముల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు మ్యాచులు ఆడిన బెంగ‌ళూరు ఐదు మ్యాచుల్లో ఓడిపోయింది పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రి స్థానంలో కొన‌సాగుతోంది. మ‌రోవైపు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ఐదు మ్యాచులు ఆడ‌గా మూడు మ్యాచుల్లో విజ‌యం సాధించింది. రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. పాయిట్ల ప‌ట్టిక‌లో నాలుగో స్థానంలో ఉంది.

ఫాఫ్ డుప్లెసిస్ నేతృత్వంలోని బెంగ‌ళూరు ప‌రిస్థితి దారుణంగా ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా ఓడిపోతే ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు మరింత సంక్లిష్టం అవుతాయి. కోహ్లి మిన‌హా మిగిలిన బ్యాట‌ర్లు నిల‌క‌డ‌గా రాణించ‌డంలో విఫ‌లం అవుతున్నారు. బ్యాటింగ్‌లో ఫ‌ర్వాలేద‌నిపిస్తున్న‌ప్ప‌టికీ బౌల‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న పేల‌వంగా ఉంది. భారీ స్కోర్లను సైతం కాపాడుకోలేని స్థితిలో ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో స‌మిష్టిగా స‌త్తా చాటాల్సిన అవ‌స‌రం ఉంది.

MI vs CSK : హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో ధోని సిక్స్‌.. రోహిత్ శ‌ర్మ రియాక్ష‌న్ ఇదే

మ‌రోవైపు క‌మిన్స్ నేతృత్వంలోని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓ మోస్త‌రు ప్ర‌ద‌ర్శ‌న చేస్తోంది. గ‌త రెండు మ్యాచుల్లోనూ విజ‌యాలు సాధించ‌డం ఆ జ‌ట్టు ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతుంది అన‌డంలో సందేహం లేదు. బెంగ‌ళూరుతో మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ విజ‌యాలు న‌మోదు చేయాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది.

హెడ్ టూ హెడ్ రికార్డు..
ఇరు జ‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు 23 సార్లు త‌ల‌ప‌డ్డాయి. ఇందులో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 12 సార్లు విజ‌యం సాధించ‌గా, బెంగ‌ళూరు 10 సార్లు గెలుపొందింది. ఓ మ్యాచ్‌లో ఫ‌లితం తేల‌లేదు. గ‌త సీజ‌న్‌లో ఇరు జ‌ట్ల మ‌ధ్య ఒకే ఒక్క మ్యాచ్ జ‌రుగగా ఆ మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజ‌యం సాధించింది.

పిచ్‌..
బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలోని పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. టాస్ గెలిచిన జ‌ట్టు ఛేజింగ్‌కు ఎగ్గువ‌గా మొగ్గు చూపుతూ ఉంటుంది. ఈ సీజ‌న్‌లో ఇక్క‌డ ఇప్ప‌టి వ‌ర‌కు రెండు మ్యాచులు జ‌ర‌గ‌గా రెండింటిలోనూ ఛేజింగ్ చేసిన జ‌ట్లే విజ‌యాన్ని అందుకున్నాయి.

తుది జ‌ట్ల అంచ‌నా..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, విల్ జాక్స్, రజత్ పాటిదార్ , గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, సౌరవ్ చౌహాన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీప‌ర్‌), వైషాక్ విజయకుమార్, రీస్ టోప్లీ, మహ్మద్ సిరాజ్.

Ruturaj Gaikwad : “కుర్రాడు ధోని” సిక్సులే కాపాడాయి : రుతురాజ్ గైక్వాడ్‌

ఇంపాక్ట్ ప్లేయర్ ఎంపికలు : రజత్ పాటిదార్/యశ్ దయాల్, సుయాష్ ప్రభుదేసాయి, అల్జారీ జోసెఫ్, ఆకాష్ దీప్, కామెరాన్ గ్రీన్

సన్‌రైజర్స్ హైద‌రాబాద్ : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్‌క్ర‌మ్‌, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్.

ఇంపాక్ట్ ప్లేయర్ ఎంపికలు : వాషింగ్టన్ సుందర్, టి.నటరాజన్/ అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, ఉపేంద్ర యాదవ్, రాహుల్ త్రిపాఠి.

ట్రెండింగ్ వార్తలు