IPL 2024 : మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజ‌న్ ఆరంభం..?

IPL 2024 window confirmed : ఐపీఎల్ 2024 సీజ‌న్‌కు సంబందించిన‌ ప్రారంభ తేదిని నిర్ణ‌యించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

IPL 2024 window confirmed between March 22 and May End

మ‌రికొన్ని గంట్ల‌లో ఐపీఎల్ 2024 సీజ‌న్‌కు సంబంధించిన మినీ వేలం దుబాయ్ వేదికగా ప్రారంభం కానుంది. కాగా.. ఐపీఎల్ 2024 సీజ‌న్‌కు సంబందించిన‌ ప్రారంభ తేదిని నిర్ణ‌యించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మార్చి 22 నుంచి మే చివ‌రి వ‌ర‌కు షెడ్యూల్ ను భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఫిక్స్ చేసిన‌ట్లుగా ఆ వార్త‌ల సారాంశం. సోమ‌వారం బీసీసీఐ ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ స‌మావేశం అయ్యాయ‌ని ఓ ప్ర‌ముఖ క్రికెట్ వెబ్‌సైట్ తెలిపింది.

ఇందులో ఐపీఎల్ 2024 షెడ్యూల్ తో పాటు విదేశీ ఆట‌గాళ్లు ఎంత మంది సీజ‌న్‌కు అందుబాటులో ఉంటార‌నే విష‌యాల‌ను చ‌ర్చించిన‌ట్లు క‌థ‌నంలో పేర్కొంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఐర్లాండ్, శ్రీలంక దేశాల‌కు చెందిన ఆట‌గాళ్లు ఐపీఎల్ 2024 సీజ‌న్ మొత్తానికి అందుబాటులో ఉండ‌నున్నార‌ని తెలిపింది.

IPL auction 2024 : ఐపీఎల్ మినీ వేలం.. ఏ జ‌ట్టు వ‌ద్ద ఎంత న‌గ‌దు ఉందో తెలుసా..?

అయితే.. వ‌చ్చే ఏడాది దేశంలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన త‌రువాత దానికి అనుగుణంగా ఐపీఎల్ షెడ్యూల్‌ను విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు పేర్కొంది.

స‌ర్వం సిద్ధం..

దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో మంగ‌ళ‌వారం ఐపీఎల్ 2024 సీజ‌న్‌కు సంబంధించిన మినీ వేలం జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే వేలానికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తి అయ్యాయి. భార‌త కాల‌మానం ప్ర‌కారం మ‌ధ్యాహ్నం ఒంటి గంట నుంచి వేలం జ‌ర‌గ‌నుంది.

Ruturaj Gaikwad : అయ్యో పాపం.. రుతురాజ్ బ‌స్సు ఎక్కేందుకు వ‌స్తే.. ముఖం మీదే డోర్ వేసిన డ్రైవ‌ర్‌.. వీడియో వైర‌ల్‌

10 ఫ్రాంచైజీల్లో క‌లిపి 77 స్లాట్స్ అందుబాటులో ఉండ‌గా 333 మంది ఆట‌గాళ్లు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు. ఇందులో 214 మంది భార‌త ఆట‌గాళ్లు కాగా.. 119 మంది విదేశీ ఆట‌గాళ్లు.

వేలం ప్ర‌క్రియ‌ను టీవీల్లో స్టార్‌స్పోర్ట్స్, ఓటీటీలో జియో సినిమాస్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నున్నాయి.