IPL auction 2024 : ఐపీఎల్ మినీ వేలం.. ఏ జట్టు వద్ద ఎంత నగదు ఉందో తెలుసా..?
IPL auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మినీ వేలం కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

A head of IPL auction 2024 Which team has the highest purse
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మినీ వేలం కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరికొద్ది గంటల్లో వేలం ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నాం ఒంటి గంటకు మినీ వేలం జరగనుంది. 10 ప్రాంఛైజీల్లో మొత్తం 77 స్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. 333 మంది ఆటగాళ్లు మినీ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఇందులో 214 మంది భారత ఆటగాళ్లు కాగా.. 119 మంది విదేశీ ప్లేయర్లు. ఇకపోతే 77 స్లాట్స్‌లో 30 విదేశీ ప్లేయర్ల కోసం కేటాయించినవే. పది ప్రాంచైజీల వద్ద మొత్తం 262.95 కోట్ల నగదు అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఏ జట్టు వద్ద ఎంత నగదు అందుబాటులో ఉంది, ఏ జట్టు ఎంత మంది ప్లేయర్లను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నయో ఓ సారి చూద్దాం..
గుజరాత్ టైటాన్స్..
మిగిలిన ఫ్రాంచైజీలతో పోలిస్తే గుజరాత్ టైటాన్స్ వద్ద అత్యధికంగా నగదు ఉంది. ఆ జట్టు వద్ద 38.15 కోట్ల నగదు ఉంది. వేలంలో 7 గురు ప్లేయర్లును తీసుకోవచ్చు. ఇందులో 5 గురు భారత ఆటగాళ్లు కాగా.. ఇద్దరు విదేశీ ప్లేయర్లు.
సన్ రైజర్స్ హైదరాబాద్..
సన్ రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ.34 కోట్లు ఉన్నాయి. వేలంలో 6 గురుని తీసుకోవచ్చు. ఇందులో ముగ్గురు భారత ఆటగాళ్లు కాగా.. మరో ముగ్గురు విదేశీ ప్లేయర్లు.
కోల్‌కతా నైట్ రైడర్స్ ..
కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.32.7 కోట్లు ఉన్నాయి. వేలంలో 12 మందిని కొనుగోలు చేయొచ్చు. ఇందులో 8 మంది భారత ఆటగాళ్లు కాగా.. 4 గురు విదేశీ ప్లేయర్లు.
చెన్నై సూపర్ కింగ్స్ ..
చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ.31.4 కోట్లు ఉన్నాయి. వేలంలో 6 గురుని తీసుకోవచ్చు. ఇందులో ముగ్గురు భారత ఆటగాళ్లు కాగా.. మరో ముగ్గురు విదేశీ ప్లేయర్లు.
పంజాబ్ కింగ్స్..
పంజాబ్ కింగ్స్ వద్ద రూ.29.1 కోట్లు ఉన్నాయి. వేలంలో 8 మందిని కొనుగోలు చేయొచ్చు. ఇందులో 6 గురు భారత ఆటగాళ్లు కాగా.. 2 గురు విదేశీ ప్లేయర్లు.
ఢిల్లీ క్యాపిటల్స్..
ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ. 28.95 కోట్లు నగదు ఉంది. వేలంలో 9 మందిని తీసుకోవచ్చు. ఇందులో 5 మంది భారత ఆటగాళ్లు కాగా.. 4 గురు విదేశీ ప్లేయర్లు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ.23.25 కోట్ల నగదు అందుబాటులో ఉంది. వేలంలో 7 గురిని కొనుగోలు చేయొచ్చు. ఇందులో 3 గురు భారత ఆటగాళ్లు కాగా.. 4 గురు విదేశీ ప్లేయర్లు.
ముంబై ఇండియన్స్..
ముంబై ఇండియన్స్ వద్ద రూ.17.75 కోట్ల నగదు అందుబాటులో ఉంది. వేలంలో 7గురిని తీసుకోవచ్చు. ఇందులో 4గురు భారత ఆటగాళ్లు కాగా.. 3 గురు విదేశీ ప్లేయర్లు.
రాజస్తాన్ రాయల్స్..
రాజస్తాన్ రాయల్స్ వద్ద రూ.14.5 కోట్లు ఉన్నాయి. వేలంలో ఎనిమిది మందిని కొనుగోలు చేయొచ్చు. ఇందులో 5గురు భారత ఆటగాళ్లు కాగా.. 3 గురు విదేశీ ప్లేయర్లు.
లక్నో సూపర్ జెయింట్స్..
లక్నో సూపర్ జెయింట్స్ వద్ద రూ.13.15 కోట్లు అందుబాటులో ఉన్నాయి. వేలంలో ఆరుగురిని తీసుకోవచ్చు. ఇందులో 4గురు భారత ఆటగాళ్లు కాగా.. ఇద్దరు విదేశీ ప్లేయర్లు.