Courtesy BCCI
IPL 2025 Andre Russell: ఐపీఎల్ 18వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆరంభం అదిరింది. సొంత గడ్డపై డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతాకు షాక్ తగిలింది. ఈడెన్ గార్డెన్స్ లో శనివారం రాత్రి ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ జట్ల మధ్య మ్యాచ్ జరగ్గా.. తొలి మ్యాచ్ లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్ లో ఇరు జట్ల బ్యాటర్లు సిక్సులు, ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. కేకేఆర్ జట్టు బ్యాటర్ డికాక్ (4) వెంటనే ఔట్ అయినప్పటికీ.. కెప్టెన్ రహానే 31 బంతుల్లో 56 (ఆరు ఫోర్లు, నాలుగు సిక్సులు), సునీల్ సరైన 26 బంతుల్లో 44 (ఐదు ఫోర్లు, మూడు సిక్సులు) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. అయితే, తరువాత బ్యాటర్లు ఆ దూకుడును కొనసాగించలేక పోయారు. దీంతో కేకేఆర్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు కేవలం 16.2ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసి విజయం సాధించింది. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓపెనర్ గా క్రీజులోకి వచ్చి 36 బంతుల్లో 59 నాటౌట్ గా (నాలుగు ఫోర్లు, మూడు సిక్సులు) నిలిచాడు.
Also Read: IPL 2025 : కోల్‌కతాకు షాక్.. బోణీ కొట్టిన బెంగళూరు.. అదరగొట్టిన కోహ్లీ, సాల్ట్!
ఈ మ్యాచ్ లో కేకేఆర్ బ్యాటర్లు సునీల్ నరైన్, రహానేలు దూకుడుగా ఆడటంతో కేవలం తొమ్మిది ఓవర్లకే ఆ జట్టు స్కోర్ 96 పరుగులు దాటింది. దీంతో ఆ జట్టు భారీ స్కోర్ సాధిస్తుందని అందరూ అంచనా వేశారు. అయితే, రహానే, నరైన్ ఔట్ అయిన తరువాత మిగిలిన బ్యాటర్లు వెంటవెంటనే వికెట్లు కోల్పోయారు. కేకేఆర్ బిగ్ హిట్టర్ ఆండ్రూ రసూల్ క్రీజులోకి వచ్చిన వెంటనే దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. 16వ ఓవర్లో సుయాశ్ శర్మ బౌలింగ్ లో భారీ సిక్సు కొట్టేందుకు యత్నించాడు.. అయితే, సుయాశ్ సూపర్ స్పిన్ బౌలింగ్ తో రసూల్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
BIGGEST MOMENT IN THE MATCH 🔥
– Suyash getting Russell, excellent from Patidar. pic.twitter.com/2m5FnLUW60
— Johns. (@CricCrazyJohns) March 22, 2025
ఇదిలాఉంటే.. మ్యాచ్ ప్రారంభంకు ముందు ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం వేడుక అదిరిపోయింది. ఈ వేడుకలో శ్రేయా ఘోషల్, దిశా పటాని, కరణ్ ఔజ్లా ప్రదర్శనలతో సందడి చేశారు. రింకూ సింగ్, విరాట్ కోహ్లీ షారుఖ్‌తో కలిసి డ్యాన్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు.