SRH vs RR : సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్.. హెడ్ టు హెడ్ రికార్డ్స్,పిచ్ రిపోర్ట్..
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం తలపడనుంది.

IPL 2025 SRH vs RR match Head to Head Predicted Playing XI
ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తన తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టోర్నీని గెలుపుతో ఆరంభించాలని ఎస్ఆర్‌హెచ్ భావిస్తోంది.
గతేడాది పాట్ కమిన్స్ నాయకత్వంలోని ఎస్ఆర్‌హెచ్ అద్భుత ప్రదర్శన చేసింది. ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఆఖరి మెట్టు పై బోల్తా పడింది. కేకేఆర్ చేతిలో ఓడిపోవడంతో తృటిలో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడే అవకాశం చేజారింది. అయితే.. ఈ సారి మాత్రం ఖచ్చితంగా ఐపీఎల్ విజేతగా నిలవాలని సన్‌రైజర్స్ పట్టుదలగా ఉంది.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఎన్ని సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. ఆధిపత్యం ఎవరిది వంటి విషయాలను చూద్దాం..
ఇప్పటి వరకు ఎస్ఆర్‌హెచ్, ఆర్ఆర్ జట్లు 20 సందర్భాల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో 11 మ్యాచ్‌ల్లో ఎస్ఆర్‌హెచ్ విజయం సాధించగా, 11 మ్యాచ్‌ల్లో ఆర్ఆర్ గెలిచింది. ఇక ఉప్పల్ స్టేడియంలో ఇరు జట్లు 5 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి సన్‌రైజర్స్ ఆధిపత్యంలో కొనసాగుతోంది.
ఇక చివరి 5 మ్యాచ్‌ల్లో ఇరు జట్లు తలపడిన సందర్భాల్లో సన్‌రైజర్స్ మూడు మ్యాచుల్లో గెలవగా, ఆర్ఆర్ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
గత ఐదు 5 మ్యాచ్‌ల్లో SRH vs RR మ్యాచ్‌ల ఫలితాలు..
* సన్‌రైజర్స్ హైదరాబాద్ 1 పరుగు తేడాతో గెలిచింది
* సన్‌రైజర్స్ హైదరాబాద్ 36 పరుగుల తేడాతో గెలిచింది.
* రాజస్థాన్ రాయల్స్ 72 పరుగుల తేడాతో గెలిచింది.
* సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో గెలిచింది.
* రాజస్థాన్ రాయల్స్ 61 పరుగుల తేడాతో గెలిచింది.
పిచ్ రిపోర్టు..
సాధారణంగా ఉప్పల్ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలం. బంతి బ్యాట్‌పైకి వస్తుండడంతో బ్యాటర్లు అవలీలగా బంతులను బౌండరీలను దాటించేస్తుంటారు. భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్‌ను టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో ప్రత్యక్షప్రసారం కానుండగా ఓటీటీలో జియో స్టార్‌లో వీక్షించొచ్చు.
ప్లేయింగ్ ఎలెవన్ అంచనా..
సన్‌రైజర్స్ హైదరాబాద్..
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్, వియాన్ ముల్డర్, పాట్ కమిన్స్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, మహమ్మద్ షమీ
ఇంపాక్ట్ ప్లేయర్లు.. జయదేవ్ ఉనద్కత్, అనికేత్ వర్మ
రాజస్థాన్ రాయల్స్..
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రోన్ హెట్మెయర్, ధృవ్ జురెల్, శుభమ్ దూబే, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ
ఇంపాక్ట్ ప్లేయర్లు.. కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్, కునాల్ సింగ్ రాథోడ్.