IPL 2025 : సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? ఉప్పల్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటి?
ఎస్ఆర్‌హెచ్ తన తొలి మ్యాచ్ ను మార్చి 23న ఆడనుంది. హోంగ్రౌండ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.

IS there rain threat to srh vs rr match in IPL 2025
ఐపీఎల్‌లో గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శన చేసింది. పాట్ కమిన్స్ నాయకత్వంలో ఫైనల్‌కు చేరుకుంది. అయితే.. ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. అయితే.. ఈ సారి అలా జరగనివ్వం అని అంటోంది ఎస్ఆర్‌హెచ్. ఐపీఎల్ 18వ సీజన్‌కు సరికొత్తగా సిద్ధమైనట్లుగా తెలిపింది. ఈ సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్ తన తొలి మ్యాచ్ ను మార్చి 23న (ఆదివారం) ఆడనుంది. హోంగ్రౌండ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.
ఉప్పల్ వేదికగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు జరగనున్న ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఫ్యాన్స్‌ను ఓ విషయం కలవరపెడుతోంది.
శుక్రవారం రాత్రి హైదారాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఆదివారం జరగనున్న మ్యాచ్‌కు వర్షం ముప్పు ఏమైనా ఉందా అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
వాతావరణ శాఖ ఏం చెబుతుంటే..?
ఆదివారం హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయ్యే పరిస్థితులు లేనట్లుగా చెప్పింది. ఆట ప్రారంభమైన మొదటి గంటలో 10 శాతం వర్షం కురిసే అవకాశం ఉంటుందని, ఆకాశం మేఘావృతమై ఉంటుందని వెల్లడించింది. మ్యాచ్ జరిగే సమయంలో ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉండనున్నట్లు తెలిపింది.
ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ఒక్కొ పాయింట్‌ను కేటాయిస్తారు.
గ్రౌండ్ రికార్డులకు వస్తే..
ఈ మైదానంలో మొత్తం 77 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు 34 సందర్భాల్లో రెండో సారి బ్యాటింగ్ చేసిన జట్లు 43 సార్లు విజయాలను సాధించాయి. ఇక టాస్ గెలిచిన జట్లు 28 సందర్భాల్లో, ఓడిన జట్లు 49 సందర్భాల్లో గెలిచాయి.
ఈ మైదానంలో అత్యధిక స్కోరును సన్‌రైజర్స్ హైదరాబాద్ సాధించింది. గతేడాది ముంబై ఇండియన్స్ పై 277/3 స్కోరు సాధించింది. అత్యల్ప స్కోరు ఢిల్లీ క్యాపిటల్స్ 80 పరుగులు నమోదు చేసింది.