LSG VS DC : ల‌క్నోతో మ్యాచ్‌.. భారీ రికార్డులపై క‌న్నేసిన కేఎల్ రాహుల్‌, కుల్దీప్ యాద‌వ్‌..

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, ల‌క్నో సూప‌ర్ జ‌ట్ల మ‌ధ్య మంగ‌ళ‌వారం మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

Courtesy BCCI

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర పోరుకు రంగం సిద్ధ‌మైంది. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, ల‌క్నో సూప‌ర్ జ‌ట్ల మ‌ధ్య మంగ‌ళ‌వారం మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ల‌క్నోలోని ఎకానా స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వ‌నుంది. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు ఢిల్లీ స్టార్ ఆట‌గాళ్లు, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాద‌వ్‌ల‌ను ప‌లు రికార్డులు ఊరిస్తున్నాయి.

51 రన్స్ చేస్తే..

ల‌క్నోతో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 51 ప‌రుగులు చేస్తే.. ఐపీఎల్‌లో 5వేల ప‌రుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఈ ఘ‌న‌త సాధించిన ఎనిమిదో ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్క‌నున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు రాహుల్ ఐపీఎల్‌లో 138 మ్యాచ్‌లు ఆడాడు. 45.8 స‌గ‌టుతో 4949 ప‌రుగులు చేశాడు. ఇందులో 4 శ‌త‌కాలు, 32 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోరు 132 నాటౌట్‌

PSL 2025 : హెయిర్‌ డ్రైయర్‌, ట్రిమ్మ‌ర్ కాదురా అయ్యా.. ష‌హీన్ అఫ్రిదికి ఖ‌రీదైన గిఫ్ట్‌..

విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌, శిఖ‌ర్ ధావ‌న్, డేవిడ్ వార్న‌ర్‌, సురేశ్ రైనా, ఎంఎస్ ధోని, ఏబీ డివిలియ‌ర్స్ లు మాత్ర‌మే ఐపీఎల్‌లో 5వేల కంటే ఎక్కువ ప‌రుగులు చేశారు.

ఐపీఎల్‌లో 5వేల ఫ్ల‌స్ ప‌రుగులు చేసిన ఆట‌గాళ్లు వీరే..

విరాట్‌ కోహ్లి – 8326 ర‌న్స్‌
రోహిత్‌ శర్మ – 6786 ర‌న్స్‌
శిఖర్‌ ధవన్ – 6769 ర‌న్స్‌
డేవిడ్‌ వార్నర్ – 6565 ర‌న్స్‌
సురేశ్‌ రైనా – 5528 ర‌న్స్‌
ధోని – 5377 ర‌న్స్‌
ఏబీ డివిలియర్స్ – 5162 ర‌న్స్‌

LED Stumps : ఐపీఎల్‌లో ఉప‌యోగించే LED స్టంప్స్ ధ‌ర ఎంతో తెలుసా? క‌ళ్లు బైర్లు క‌మ్మాల్సిందే..

ఒక్క వికెట్ తీస్తే..

ల‌క్నోతో మ్యాచ్‌లో కుల్దీప్ యాద‌వ్ ఒక్క వికెట్ తీస్తే ఐపీఎల్‌లో 100 వికెట్ల మైలురాయిని అందుకుంటాడు. ఈ ఘ‌న‌త సాధించిన 27వ బౌల‌ర్‌గా రికార్డుల్లోకి ఎక్కుతాడు. ఇక ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు యుజ్వేంద్ర చహల్‌ పేరిట ఉంది. చాహ‌ల్ ఇప్ప‌టి వ‌ర‌కు 214 వికెట్లు తీశాడు. అత‌డు మిన‌హా మ‌రే బౌల‌ర్ కూడా ఐపీఎల్‌లో 200 వికెట్ల‌ను ప‌డ‌గొట్ట‌లేదు. అత‌డి త‌రువాత పీయూశ్‌ చావ్లా (192), భువనేశ్వర్‌ కుమార్‌ (189), సునీల్‌ నరైన్‌(187), రవిచంద్రన్‌ అశ్విన్‌ (185) లు ఉన్నారు.